మరో బాంబు పేల్చిన పయ్యావుల-జగన్ సర్కార్ వివరణ కోరిన కేంద్రం-మితిమీరిన అప్పులపై

ఏపీ ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న నేపథ్యంలో సర్కార్ ను విపక్షాలు నిత్యం ఏకిపారేస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం కూడా రుణ పరిమితిలో కోతలు విధించడంతో పాటు ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తోంది. తాజాగా ఇలాంటి ఓ లేఖను ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విడుదల చేశారు. రెండు రోజుల క్రితం రూ.40 వేల కోట్ల చెల్లింపుల్ని ట్రెజరీల ద్వారా కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా జరిపారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆయన.. తాజాగా అప్పులపై కేంద్రం లేఖను విడుదల చేసి మరో బాంబు పేల్చారు.

జగన్ సర్కార్ పై మరో బాంబు పేల్చిన పయ్యావుల

జగన్ సర్కార్ పై మరో బాంబు పేల్చిన పయ్యావుల

ఏపీలో ఆర్ధిక వ్యవహారాల నిర్వహణను లక్ష్యంగా చేసుకుని తాజాగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. తాజాగా మరో బాంబు పేల్చారు. ఏపీలో ఆర్ధిక పరిస్దితులు, అదనపు రుణాలపై కేంద్రం అభ్యంతరాలు గుర్తు చేస్తూ పయ్యావుల ఈ లేఖ విడుదల చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖను విడుదల చేయడం ద్వారా ఆర్ధిక పరిస్ధితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు పయ్యావుల మరో ప్రయత్నం చేశారు.

మితిమీరిన అప్పులపై కేంద్రం సీరియస్

మితిమీరిన అప్పులపై కేంద్రం సీరియస్

ఏపీలో ప్రభుత్వం ఇప్పటికే తమకు ఇచ్చిన రుణ పరిమితిని దాటి అప్పులు చేస్తోందంటూ కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తాజాగా ఓ లేఖ రాసింది. ఇందులో ఏపీ సర్కార్ రూ.17,923.94 కోట్ల అదనపు అప్పులు చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి ఈ అప్పులు ఉన్నట్లు ఈ లేఖలో కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లేఖను ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బహిరంగంగా విడుదల చేశారు. ఏపీ సర్కార్ ను టార్గెట్ చేసేలా ఉన్న ఈ లేఖ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది.

సర్కార్ స్పందించాలన్న పయ్యావుల

సర్కార్ స్పందించాలన్న పయ్యావుల

ఏపీ ఆర్ధిక శాఖ వ్యవహరాలు.. అస్తవ్యస్థ విధానాలపై లేఖల రూపంలో దాడి చేస్తున్న పీఏసీ ఛైర్మన్.. తన తాజా లేఖపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడంపై ఆర్ధిక శాఖ స్పందించాలని పయ్యావుల తెలిపారు.

రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖతో స్పష్టమైందని పయ్యావుల తెలిపారు. రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాల పై కేంద్రానికి అయినా సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+