వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ బాటలో జగన్- తేడా వస్తే సర్పంచ్ లు ఇక ఇంటికే....

|
Google Oneindia TeluguNews

పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ నిబంధనలు పాటించకుండా కాలం గడిపేయాలనుకున్న సర్పంచ్ లకు ఇక గడ్డుకాలమే. తెలంగాణలో సర్పంచ్ ల అధికారాలు, విధుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరినే ఇక్కడా అమలు చేసేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. నిబంధనలు పాటించకపోయినా, అవినీతికి పాల్పడినా సర్పంచ్ లు ఇక నిద్రలేని రాత్రులు గడపాల్సిందే.

 పంచాయతీ చట్టం మరింత కఠినం

పంచాయతీ చట్టం మరింత కఠినం

ఏపీ పంచాయతీ రాజ్ చట్టాన్ని మరింత కఠిన తరం చేయడం ద్వారా క్షేత్రస్ధాయిలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఇప్పటికే జగన్ సర్కారు నిర్ణయించింది. ఎన్నికల్లో డబ్బు, మద్య పంచినట్లు గుర్తిస్తే అనర్హత వేటు వేయడంతో పాటు గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష విధించేందుకు వీలుగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. అంతకుముందు కేబినెట్ ఆమోదించిన ఈ నిబంధనలు ఆర్డినెన్స్ లో పొందుపరిచారు.

గ్రామసభలు నిర్వహించకపోతే..

గ్రామసభలు నిర్వహించకపోతే..

ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చిన సవరణల మేరకు ఉత్తర్వులను అమలు చేయకపోయినా, గ్రామసభలు నిర్వహించకపోయినా బాధ్యులైన సర్పంచ్, ఉపసర్పంచ్ లను పదవుల నుంచి ఉద్వాసన పలికేలా నిబంధనలు తెచ్చారు. ఇప్పటివరకూ కీలక విషయాల్లో గ్రామసభలు నిర్వహించకుండానే సర్పంచ్ లు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్ ల తొలగింపులో సర్వాధికారాలు కలెక్టర్లకే కట్టబెట్టారు.

స్ధానికంగా నివాసం, రోజూ ఆఫీసుకు...

స్ధానికంగా నివాసం, రోజూ ఆఫీసుకు...

పంచాయతీ రాజ్ చట్టంలో తాజాగా తీసుకొచ్చిన సవరణల ప్రకారం ప్రతీ సర్పంచ్, ఉపసర్పంచ్ స్ధానికంగానే నివాసం ఉండాలి. అలాగే రోజూ పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందే. తనకిచ్చిన అధికారాలు దుర్వినియోగం చేసినా, దుష్ప్రవర్తనకు పాల్పడినా, నిధులు సొంతానికి వాడుకున్నా, కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయకపోయినా వీరికి ఉద్వాసన తప్పదు. తప్పిదాలపై వివరణ ఇచ్చే అవకాశం కల్పించి ఉద్వాసన పలికేందుకు కలెక్టర్లకు అధికారమిచ్చారు.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Corona Virus | ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి! | Oneindia Telugu
తొలగింపుపై 30 రోజుల్లో అప్పీలు

తొలగింపుపై 30 రోజుల్లో అప్పీలు

సర్పంచ్, ఉపసర్పంచ్ పదవుల నుంచి ఉద్వాసనకు గురైన వారు ప్రభుత్వానికి అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు కల్పించారు. వారిపై తుది నిర్ణయం తీసుకునే వరకూ ప్రభుత్వం స్టే ఇచ్చే అధికారముంటుంది. స్టే సమయంలో అవిశ్వాసం మినహా మిగతా అన్ని పంచాయతీ సమావేశాలకు వీరు హాజరు కావచ్చు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే సర్పంచ్, ఉపసర్పంచ్ లను ఆరునెలల పాటు తాత్కాలికంగా కూడా సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు. ఏడాది వ్యవధిలో దీన్ని పొడిగించే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుంది.

English summary
Andhra Pradesh Govt's Recent Amendment to Panchayat Raj Act made Sarpanches Sleepless. New Rules brought in Panchayat Raj Act allows the District Collectors to Take Stringent action on Sarpanches who are not adhere the Rules. With this Amendments Collectors Can Send Sarpanches to Jail or Disqualify also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X