Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ పై ప్రేమను కుమ్మరించిన ఏపీ ప్రజలు.. అందుకు ఇదే నిదర్శనం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన విజయం సాధించింది. అయితే జనసేన సాధించిన విజయం అట్లాంటి విజయం కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% ఏ రాజకీయ పార్టీ సాధించని విజయం. పోటీ చేసిన ప్రతి చోట ప్రజలు జనసేన అభ్యర్థికే పట్టం కట్టిన విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా ప్రజలు పవన్ కళ్యాణ్ కు అందించిన విజయం.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్, జనసేన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎదురుగా జనసేన పార్టీ సృష్టించిన రికార్డు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. గత దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఊహించని ఘోర ఓటమిని చవిచూశారు. ఏకంగా గాజువాక, భీమవరం రెండుచోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పరాజయం పాలై అధికార పార్టీ నేతల మాటలతో అనేకమార్లు అవమానాన్ని చవిచూసారు.

AP People poured love on Pawan Kalyan janasena 100 percent results evidence for that

పవన్ ను ఆవేదనకు గురి చేసిన ఏపీ ప్రజల తీర్పు
ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఏపీ ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన మీటింగ్లకు ఇసుకేస్తే రాలనంత మంది వచ్చిన జనం తనకు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తనమీద ప్రేమ ఉంది కానీ అది ఓటు బ్యాంకు గా ఎందుకు మారలేదనేది అర్థం కాక లబోదిబోమన్నారు.

ఓడినా ప్రజల కోసమే పని చేసిన పవన్
గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వెళతారు అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల కోసమే ఏపీలో అధికార పార్టీపై పోరాటం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై తన గళాన్ని వినిపించారు. ఈ ఎన్నికలలో ప్రజల మద్దతు కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రతీ చోటా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

AP People poured love on Pawan Kalyan janasena 100 percent results evidence for that

పవన్ కళ్యాణ్ పై నిర్ణయం మార్చుకున్న ఏపీ ప్రజలు
గత ఎన్నికల్లో రెండు చోట్ల తనను ఓడించాలని జనసేన పార్టీని ఓటమిపాలు చేసినా తాను మీ కోసమే పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలపై బాగా పనిచేశాయి. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక స్థానం అది కూడా తమది అని చెప్పుకోలేని స్థానం ఇచ్చిన ప్రజలు ఈసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కు చేసిన అన్యాయం ఈసారి జరగకూడదని నిర్ణయించుకున్నారు.

వంద శాతం విజయం సాధించిన జనసేన
ఇందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలలోను విజయాన్ని కట్టబెట్టారు. ఏకంగా వంద శాతం పవన్ కళ్యాణ్ పార్టీకి విజయాన్ని ఇచ్చి ఒక్కసారిగా ప్రేమను కుమ్మరించారు. పవన్ కళ్యాణ్ పైన తమకున్న ప్రేమను ఓటు ద్వారా స్పష్టం చేశారు. ఏపీ ఓటర్లు 2019లో చేసిన తప్పును ఈ రకంగా దిద్దుకొని పవన్ కు ఊహించని అద్భుతమైన బహుమతిని ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+