ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..!
గతంలో ప్రభుత్వాలు తమకు నచ్చని సోషల్ మీడియా పోస్టులు ఎవరైనా పెడితే వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైళ్లకు సైతం పంపేవారు. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఉన్న బావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ఇలా కేసులు పెట్టడం, జైళ్లకు పంపడాన్ని నిషేధించింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వాలు రూటు మార్చి పోలీసుల సాయంతో ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు మెయిల్స్ పంపుతూ, సదరు వివాదాస్పద కంటెంట్ ను తొలగించాలని కోరుతున్నాయి. దీంతో కేంద్రం తెచ్చిన ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సదరు కంటెంట్ ను బ్లాక్ చేస్తున్నాయి.
తాజాగా ఏపీలో పోలీసులు (AP Police ) ఇలా వందల కొద్దీ ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు నోటీసులు పంపి బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో మంగళగిరి రూరల్ పోలీసులు కాస్త ముందుకెళ్లి ఏకంగా అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ FBI పేరుతో ఎక్స్ కు ఈ మెయిల్స్ పెట్టారు. ఇందులో విపక్ష వైసీపీ నేతలతో పాటు జర్నలిస్టులు పెట్టిన పోస్టుల్ని కూడా బ్లాక్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి నచ్చని కంటెంట్ బ్లాక్ చేయాలని కోరేందుకు తమ ఐడెంటిటీని వాడుకుంటే సరిపోయే దానికి FBI పేరు వాడటం వివాదాస్పదంగా మారింది. దీంతో ఇప్పుడు మంగళగిరి ఎఫ్బీఐ పేరుతో గత కొన్ని రోజులుగా ట్రోల్స్ పడుతున్నాయి.

Since when did @APPOLICE100 decide to harass media? #Journalismisnotacrime @dhanyarajendran @thenewsminute https://t.co/z3O1Rihccs
— Chitra Subramaniam (@chitraSD) September 17, 2026
ఇదంతా ఓ ఎత్తయితే మీడియా కంటెంట్ ను ఎక్స్ కు మెయిల్ పెట్టి బ్లాక్ చేయించడం, దానికి ఎఫ్బీఐ పేరు వాడకంపై పలు ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి పోలీసులు (Mangalagiri Police ) ఎక్స్ కు పెట్టిన ఎఫ్బీఐ రిఫరెన్స్ మెయిల్స్, వాటికి ఎక్స్ ఇచ్చిన సమాధానాలు ట్వీట్లు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా జాతీయ మీడియాకు చేరుతోంది. ఇప్పటికే న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ పోస్టును ఎక్స్ బ్లాక్ చేయడం, మంగళగిరి పోలీసుల మెయిల్ పై మండిపడుతూ ఆమె పెట్టిన ట్వీట్ కు పలువురు స్పందిస్తున్నారు. ఇందులో ఆమె ఏపీ పోలీసులు మీ ఉద్యోగం ఇదేనా అని ప్రశ్నించారు. ఓ చిన్న స్థాయి టీడీపీ నేత కోసం ఇలా మెయిల్స్ పెట్టే బదులు ప్రజలకు అండగా నిలవాలని ఏపీ పోలీసుల్ని ఆమె కోరారు. ఈ పోస్టును న్యూస్ మినిట్ కో ఫౌండర్ చిత్రా సుబ్రమణ్యం రీట్వీట్ చేస్తూ మీడియాను వేధించాలని ఏపీ పోలీసులు ఎప్పటి నుంచి నిర్ణయించుకున్నారని నిలదీశారు.














Click it and Unblock the Notifications
