వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు- నాలుగువారాల ముందు కోడ్‌- నిమ్మగడ్డ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తొలి విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో కరోనా ఉధృతి తగ్గినందున వివిధ రాజకీయ పార్టీలతో చర్చించిన మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్దమైనట్లు కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఏపీలో కరోనా ఉధృతి బాగా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య పది వేల నుంచి 753కు తగ్గిపోయిందని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని నిమ్మగడ్డ గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ వెల్లడించారు.

ap sec nimmagadda announced to hold panchayat elections in february 2021

ప్రభుత్వంతో పాటు రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్ధికసంఘం నిధులు తీసుకోవాలన్నా ఎన్నికల నిర్వహణ తప్పనిసరని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రకటించినా ఎన్నికల సంఘం తేదీలు మాత్రం వెల్లడించలేదు.

English summary
andhra pradesh state election commission has decided to hold panchayat elections in february 2021, which were postponed due to covid 19 this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X