జనంలోకి టీడీపీ మ్యానిఫెస్టో-త్వరలో బస్సు యాత్రలు-అచ్చెన్నాయుడు ప్రకటన...
సంక్షేమం ముసుగులో ప్రజల్ని కడుబీదలుగామార్చిన జగన్ , రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన పథకాలు ప్రజలజీవితాలకు కొత్తఊపిరిలూదాయని అచ్చెన్న తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో పార్టీ నేతలు కొల్లురవీంద్ర, అనగానిసత్యప్రసాద్, పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ లతో కలిసి 'బీసీ భరోసా లోగో' పోస్టర్లు ఆవిష్కరించారు.
చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించిన భవిష్యత్ కు గ్యారెంటీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రచారం చేపట్టనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. 5 బస్సుల్ని చంద్రబాబు 19వతేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రారంభిస్తారన్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రచారబస్సులు 125 నియోజకవర్గాల్లో తిరగనున్నాయని తెలిపారు.నియోజకవర్గాలఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు బస్సుల్లో వెళ్లి ప్రజలతో మమేకమై, చంద్రబాబువారికోసం ప్రకటించిన పథకాల్ని తెలియచేస్తారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అలానే జగన్ పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, వారుపడుతున్న కష్టాలను తెలుసుకొని, భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ అధినేతతో తమ అభిప్రాయాల్ని నేతలు పంచుకుంటారని అచ్చెన్న తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచి, పేదల్నిధనవంతుల్ని చేసే బృహత్తర కార్యక్రమమే చంద్రబాబు ప్రకటించిన 'భవిష్యత్ కు గ్యారెంటీ' పథకమని అచ్చెన్న వెల్లడించారు. టీడీపీ మేనిఫెస్టో పులిహోరలాంటిదన్నజగన్, పులిహోరపేదలకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుందో ఆయన మాటలతోనే ఒప్పుకున్నట్లు అచ్చెన్న గుర్తుచేశారు.
జగన్మోహన్ రెడ్డిని మించిన యాక్టర్ ప్రపంచంలో మరొకరుఉండరని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్రప్రభుత్వంతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉండబట్టే 4ఏళ్లుగా అవినీతికేసుల విచారణకు కోర్టులకు వెళ్లడంలేదన్నారు. కేంద్రపెద్దల అండతోనే బాబాయ్ హత్యకేసులో అసలుముద్దాయిల్ని సీబీఐ అరెస్ట్ లనుంచి కాపాడుకోగలుగుతున్నాడన్నారు. బీజేపీ సహాయసహాకారాలుండబట్టే ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పులుతెచ్చి, ఆ సొమ్ములో 90శాతం దిగమింగాడన్నారు.
వైసీపీప్రభుత్వం సంక్షేమంముసుగులో పేదల్ని కడుబీదలుగా మార్చిందని, నాలుగన్నరేళ్లపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిఒక్కరిపై రూ.2.05లక్ష ల అప్పువేశాడని, నిత్యావసరాలధరల పెంపుతోపాటు, ఇతరత్రాపన్నులు వేసి ప్రజల్ని లూఠీచేస్తున్నాడని, కేంద్రంనుంచి ఇతరత్రామార్గాల్లో తీసుకొచ్చే అప్పుల్లో 90శాతంసొమ్ముని ప్రభుత్వమే దోచేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications