AP EAPCET 2023 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి...
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఏపీఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది అనంతపురం జేఎన్టీయూ నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది మే 15 నుంచి మే 19 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షను మే 15 నుంచి 19 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను మే 22 నుంచి 23 వరకు నిర్వహించారు. వీటి ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. వీటితో పాటు పలు ఇతర వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యాక హోం పేజ్ లో ఇచ్చిన AP EAPCET Results 2023 లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్కోర్ కార్డు వస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అనంతరం ఈ కార్డును కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆధారంగా హాజరయ్యేందుకు వాడుకోవచ్చు.
ఈ ఏడాది ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో 25 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఈసారి ఇంజినీరింగ్‌లో 76.32 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24, 724 మంది పరీక్ష రాయగా అందులో 1,71,514 మంది అర్హత సాధించారు. అలాగే వ్యవసాయ విభాగంలో 90,573 పరీక్ష రాయగా.. 81,203 మంది అర్హత సాధించారు.












Click it and Unblock the Notifications