వివేకా హ‌త్య‌కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై భారీ స్కెచ్‌?

అజాత శ‌త్రువుగా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై ప్ర‌త్య‌ర్థులు భారీ స్కెచ్ వేసిన‌ట్లుగా తెలియ‌వ‌స్తోంది. అప్రూవ‌ర్‌గా మారిన‌ప్ప‌టి నుంచి త‌న ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ద‌స్త‌గిరి పోలీసుల‌ను కోరుతున్నారు. అయితే ఇప్పుడు ద‌స్త‌గిరిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం చూస్తుంటే ఇదంతా ఒక ప‌థ‌కం ప్ర‌కారం జ‌రుగుతోందంటూ న్యాయ‌నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తొండూరు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు

తొండూరు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు

ద‌స్త‌గిరిపై తొండూరు పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఆయ‌న సోద‌రుడు మ‌స్తాన్‌కు, పెద్ద గోపాల్ అనే వ్య‌క్తికి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. గోపాల్ తొండూరు పోలీస్ స్టేష‌న్‌లో మ‌స్తాన్‌పై ఫిర్యాదు చేశారు. స్టేష‌న్‌కు వెళ్లేట‌ప్పుడు మ‌స్తాన్ త‌న సోద‌రుడు ద‌స్త‌గిరిని కూడా తీసుకొని వెళ్లారు.

పోలీస్ స్టేష‌న్లోనే మాట మాట పెరిగి ద‌స్త‌గిరి త‌న‌పై దాడిచేశాడ‌ని గోపాల్ అక్క‌డే ఫిర్యాదు చేశాడు. అంటే దీన్నిబ‌ట్టి అర్థ‌మ‌య్యేది ఏమిటంటే సినిమాల్లో చూపించిన‌ట్లుగా పోలీసుల ముందు ద‌స్త‌గిరి గోపాల్‌పై దాడి చేయ‌గా, గోపాల్ ఫిర్యాదు చేయ‌గా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసుకు సాక్షులు పోలీసులే కావ‌డం చిత్రం.

ద‌స్తిగిరిని బెదిరించ‌డం ఏమ‌న్నా పెద్ద ప‌నా?

ద‌స్తిగిరిని బెదిరించ‌డం ఏమ‌న్నా పెద్ద ప‌నా?


వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ జ‌రుపుతున్న సీబీఐ అధికారులనే అడ్డ‌గించి మ‌రీ బెదిరించారు అనుమానితులు. అలాంటిది అప్రూవ‌ర్ గా మారిన ద‌స్త‌గిరిని బెదిరించ‌డం పెద్ద ప‌నేం కాద‌ని అంటున్నారు. సీబీఐ విచార‌ణ జ‌ర‌గ‌కుండా అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న‌ప్ప‌టికీ అధికారులు దాదాపుగా కేసు ద‌ర్యాప్తును పూర్తిచేశార‌ని భావిస్తున్నారు.

వివాదాస్ప‌దంగా పోలీసుల తీరు

వివాదాస్ప‌దంగా పోలీసుల తీరు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వివేకా హ‌త్య కేసుకు సంబంధించి పోలీసుల అనుస‌రిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సీబీఐ అధికారులు, వారి కారు డ్రైవ‌ర్ ఫిర్యాదు చేసినా ఇంత‌వ‌ర‌కు అతీగ‌తీ లేదు. సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీలించి నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు ఆ కేసు అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు.

కేసులో నిందితులుగా ఉన్న‌వారు బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ సీబీఐ అడ్డుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ సాక్షుల‌ను బెదిరింపులు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి వంతు వ‌చ్చింద‌ని, ఆయ‌న ప్రాణాల‌కు ఏమైనా అయితే పోలీసులే బాధ్య‌త వ‌హించాల‌ని, అలాగే ఆయ‌న‌కు ఏమీకాదు అని హామీ ఇచ్చిన సీబీఐ అధికారులు కూడా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని ద‌స్త‌గిరి కుటుంబ స‌భ్యులు హెచ్చ‌రిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+