ఏపీకి గుడ్ న్యూస్
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఫర్వాలేదనిపించాయి.
ఇదే పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, ఉత్తరం- మధ్య కోస్తా, దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, ఏజెన్సీ ఏరియా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications