డ్యాన్స్ చేసి సస్పెండైన ఆర్టీసీ డ్రైవర్-లోకేష్ జోక్యంతో తిరిగి విధుల్లోకి..!
ఏపీలో తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తుని ఆర్టీసీ డిపోకి చెందిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణం మధ్యలో ట్రాక్టర్ అడ్డుగా రావడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ లోవరాజు బస్సు దిగి రోడ్డుపై దేవర సినిమాలో పాటకు స్టెప్పులేశాడు.వీటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ స్టెప్టులు ఎంత బావున్నాయంటే ఏకంగా మంత్రి నారా లోకేష్ ఆయన్ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు.
@naralokesh అన్న మీరు ట్వీట్ చేయకముందే
— Dr.మహిష్మ.కె (@drmahishmak) October 28, 2024
ఈ డ్రైవర్ ను సస్పెండ్ చేసేసారు అంట అన్న.. Can you please look into it.🙏🏽
Discipline n punctuality is important but some harmless fun along the way is not a crime. https://t.co/FoHxzkdH3j
మంత్రి లోకేష్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ కు మెచ్చుకుని సూపర్ బ్రదర్ కీప్ ఇట్ అప్ అంటూ ట్వీట్ పెట్టారు. అయితే అప్పటికే డ్యాన్స్ విషయం తెలిసిన అధికారులు డ్రైవర్ లోవరాజును విధుల నుంచి తప్పించారు. ఈ విషయాన్ని నెటిజన్లు ఎక్స్ లోనే లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమెరికా నుంచే స్పందించిన లోకేష్... అతని ఉద్యోగానికి వచ్చిన ముప్పేమీ లేదని, తాను తిరిగి రాగానే ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

The suspension orders will be revoked, and he will be taken back to work immediately. I will meet him personally when I come back 😊 https://t.co/netfEfeAo3
— Lokesh Nara (@naralokesh) October 28, 2024
అయితే ఇంకా అమెరికాలోనే ఉన్న మంత్రి నారా లోకేష్ .. అక్కడి నుంచే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సదరు డ్రైవర్ లోవరాజుకు తిరిగి తన ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు తాను అమెరికా నుంచి తిరిగి రాగానే లోవరాజును కలుస్తానని కూడా చెప్పారు. దీంతో డ్రైవర్ లోవరాజు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మంత్రి హోదాలో ఉండి కూడా ఓ చిన్న ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్ ప్రతిభను మెచ్చుకోవడమే కాకుండా అతని ఉద్యోగాన్ని కాపాడటంపై నెటిజన్లు సైతం లోకేష్ ను ప్రశంసిస్తున్నారు.
-
ఒకే ఒక్క ప్రకటనతో మారిన ఏపీ రాజకీయ చిత్రం! లోకేష్‌కు పట్టాభిషేకం -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications