APSRTC: ఆర్టీసీలో ప్రైవేటీకరణ చిచ్చు?- సర్కార్ కు ఉద్యోగసంఘాల షాక్..!
ఏపీలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (APSRTC)లో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఉద్యోగులకు షాకిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ బస్సుల్ని, ఆర్టీసీ డిపోల్ని సైతం ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వారు మండిపడుతున్నారరు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వానికి ఆర్టీసీ గుర్తింపు ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కీలక హెచ్చరికలు పంపింది. తక్షణం ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని నేతలు కోరారు.
విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పూణేకు చెందిన పినకల్ కంపెనీకి 11 ఆర్టీసి డిపోలు కేటాయింపు నిర్ణయం వెంటనే రద్దు చేయాలని ఈయూ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్, సి.ఎన్.జీ, డీజిల్ బస్సులు అన్నీ ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అలాగే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానం సంస్థకు నష్టం కలిగిస్తుందని ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ హెచ్చరించారు.

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి డిపోలు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. విధ్యుత్ బస్సులకు మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలన్నారు. విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, కానీ ప్రెవేటు వారితో కాకుండా ఆర్టీసి ద్వారానే నిర్వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరికలు చేసింది.

మరోవైపు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరుగుతున్న భారత్ బంద్ కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా 129 ఆర్టీసీ డీపోలు, 4 వర్క్‌షాపుల్లో ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై గేట్ మీటింగ్స్ నిర్వహించాలని ఈయూ పిలుపునిచ్చింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగుల గేట్ మీటింగ్ నిరసనలు చేపట్టనున్నారు. 4 లేబర్ కోడ్స్ రద్దు, ప్రైవేటీకరణ-ఔట్‌సోర్సింగ్ నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కనీస పెన్షన్ రూ.10,000 కు పెంచాలని, స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులకు వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీలో 3 వేల కొత్త బస్సులు, 10 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications