Araku: స్వదేశీ దర్శన్ తో అద్భుతంగా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఆంధ్రా ఊటీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారాన్ని తీసుకుంటూ రాష్ట్రంలోని టూరిజాన్ని డెవలప్ చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందాలను మరింత అందంగా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.
పర్యాటక రంగంపై ఏపీ సర్కార్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘమైన టువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది. పలు పర్యాటక ప్రాంతాలు ప్రజల మనసులను దోచుకునేవి ఉన్నాయి. ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఏపీ ఆలవాలంగా ఉంది. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వనరులను టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఏపీని దేశంలోనే అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కేంద్ర ప్రభుత్వ పథకంతో ఏపీ పర్యాటకాభివృద్ధి
కేంద్ర ప్రభుత్వ పథకం అయిన స్వదేశీ దర్శన్ తో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులను కేటాయిస్తూ ఉంటే ఏపీలోని అనేక ప్రాంతాలను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జునసాగర్ బుద్ధ థీమ్ పార్క్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు, బాపట్ల లోని సూర్యలంక బీచ్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ప్రాంతాలలో మొదలైన అభివృద్ధి పనులు
పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాలను సేవలను మెరుగుపరచడానికి పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ప్రాంతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం ఉద్దేశించబడింది.ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అరకులోయ, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు ఇప్పటికే అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నా, మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించి ఆంధ్ర ఊటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది.
ఈ ప్రాంతాల అభివృద్ధికి స్వదేశీ దర్శన్
అరకులోయ, పాడేరు ప్రాంతాలలో ముంచంగిపుట్టు, పెదబయలు మండలంలోని మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతం, సుజనకోట మత్స్యగెడ్డ, దీవులు, జోలాపుట్టు జలాశయం నుంచి ఉన్న మత్స్యగెడ్డ ప్రాంతాలను 'స్వదేశీ దర్శన్' కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా తారాబు జలపాతం వద్ద గాజు వంతెనని కూడా నిర్మించనున్నారు. రహదారుల నిర్మాణంతోపాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా హోమ్ స్టే లను ఏర్పాటు చేస్తున్నారు.
తారాబు జలపాతం వద్ద గాజు వంతెన
తారాబు జలపాతం వద్ద నిర్మించే గాజు వంతెనకు కాయలను కేటాయించారు. ఇక అరకులోయ మండలంలో 91 హోమ్ స్టే లు, చింతపల్లి మండలంలో 30 చోట్ల హోమ్ స్టేలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఇక్కడికి ఎక్కువమంది వస్తారని, తద్వారా ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి కలుగుతుందని, ఏపీకి పర్యాటకం ఒక ఆదాయ వనరుగా మారుతుందని భావిస్తున్నారు.
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
LPG: ఏపీలో ఎల్పీజీ గ్యాస్ పరిస్ధితి ఇదే..! తేల్చేసిన సర్కార్-స్పెషల్ టీమ్స్..! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
NTR Vaidya Seva: డబ్బులిస్తేనే వైద్యం-ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఆస్పత్రులు..! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి..












Click it and Unblock the Notifications