తీవ్ర తుఫానుతో హై అలర్ట్, ప్రచండ గాలులు- వర్షాలు మొదలు.. తాజా హెచ్చరికలు..!!

ఆర్నాబ్ తుఫాను తీవ్రంగా మారుతోంది. అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. కోనసీమ ప్రాంతంలో విరుచుకుపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంచనాలకు మించిన వేగంతో గాలులు గీస్తాయని హెచ్చరిస్తున్నారు. రేపు అతి తీవ్ర తుఫానుగా కోనసీమ వద్ద తీరం దాటుతుందని వెల్లడించారు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సహాయక టీంలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో కీలక అలర్ట్స్ జారీ చేసారు.

ఆర్నాబ్ తుఫాను తీరానికి సమీపిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా కోనసీమలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల పైన ప్రభావం ఉండనుంది. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసారు. ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను మొహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునారావాస శిబిరాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మొదలైంది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి అధికారులందరూ స్థానికంగానే అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు పైన రాకపోకలు నిలిపివేసారు. తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రోడ్ల పైకి దూసుకొస్తున్న అలలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
arnab-cyclone-impact-begins-as-sea-water-surges-inland-rains-lash-several-areas-here-the-latest-re

గోదావరి జిల్లాల పై పెను ప్రభావం

విశాఖ జిల్లాలోనూ తుఫాను ప్రభావం మొదలైంది. విశాఖలో గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. విశాఖ మహారాణిపేట అంగడిదిబ్బ వద్ద చెట్టు విరిగిపడింది, దీంతో ఇంటి ఆవరణలో ఉన్న పాన్ దుకాణం ధ్వంసమైంది. అర్నబ్ తీరం దాటే సమయంలో గంటకు ఏకంగా 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో భారీ అలల తాకిడికి రాళ్లగట్టు దాటి రోడ్డుపైకి రాళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడుతుండగా.. విశాఖ జిల్లా భీమిలి తీరంలో సముద్ర అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బాపట్ల వరకు అన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+