ఆసక్తికరం: టీడీపీ ఎంపీల నినాదాలకు జై కొట్టిన సోనియా, గల్లా ప్రసంగం హల్‌చల్

Recommended Video

    TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP

    అమరావతి/న్యూఢిల్లీ: బడ్జెట్ తొలి విడత సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయానికి తోడు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కేంద్రమంత్రులు తదితరుల నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు గురువారం సాయంత్రం సూచించారని తెలుస్తోంది.

    చదవండి: వాళ్లకంటే పెద్ద మోసగాళ్లు: మోడీపై టీడీపీ, బీజేపీని మరోసారి ఏకేసిన గల్లా జయదేవ్

    ఆయన పార్టీ ఎంపీలతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మొన్న ప్రధాని మోడీ ప్రసంగం, నిన్న అరుణ్ జైట్లీ ప్రసంగంపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు నిరసన తెలపాలని ఆయన సూచించే అవకాశముంది.

    చదవండి: సభలో ఆసక్తికరం: విభజనపై ఖర్గే నోటీసు, విజయసాయిపై వెంకయ్య ఆగ్రహం, సుజనకు అండ

     వీ వాంట్ జస్టిస్

    వీ వాంట్ జస్టిస్

    గురువారం లోకసభలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలు.. సోనియా గాంధీని కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు, సభలోను ఏపీ ఎంపీలకు ఆమె మద్దతు తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తూ.. వియ్‌ వాంట్‌... గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. వారి వెనుక సీట్లో కూర్చున్న సోనియా గాంధీ 'జస్టిస్‌' అని చిన్నగా అన్నారని తెలుస్తోంది. కొద్దిసేపు ఆమె 'జస్టిస్‌...' అన్న నినాదాన్ని కొనసాగించారట.

     అప్పులు తెచ్చి రాష్ట్రానికి పంచలేం

    అప్పులు తెచ్చి రాష్ట్రానికి పంచలేం

    లోకసభలో గురువారం సాయంత్రం జైట్లీ ఏపీకి ఇచ్చిన అంశాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో మరిన్ని వివరాలు ఇస్తామని చెప్పారు. జైట్లీ ప్రకటనపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సమయంలో జైట్లీ మాట్లాడుతూ.. అప్పులు తెచ్చి రాష్ట్రాలకు పంచలేమని అభిప్రాయపడ్డారు.

     ఇప్పుడు ఏపీ దగ్గర డబ్బుల్లేవు

    ఇప్పుడు ఏపీ దగ్గర డబ్బుల్లేవు

    ఇప్పుడు ఏపీ దగ్గర డబ్బులు లేవని, ఇప్పటికే కేంద్రం ఈ ఏడాదిలో ఆమోదించిన రుణాలు రూ.58వేల కోట్లకు చేరాయని, వాటిలో కొంత మొత్తాన్ని వీరికి ఇచ్చి ఉంటే వీరి ముఖాల్లో నవ్వులు పూసి ఉండేవేమో అని వెల్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను చూపిస్తూ జైట్లీ వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తనను మరింత అడుగుతున్నారని జైట్లీ పేర్కొన్నారు. జైట్లీ ప్రసంగం అయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆయన ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రసంగంలో కొత్త అంశమేమీ చెప్పలేదన్నారు.

     సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గల్లా ప్రసంగం

    సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గల్లా ప్రసంగం

    మరోవైపు, బుధవారం లోకసభలో గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయిదు బడ్జెట్‌లు అయిపోయాయని, మీరు పదేపదే హామీలు ఇస్తున్నారని, మేం ఎదురు చూస్తూనే ఉన్నామని, తమను సహనంతో ఉండమని చెబుతున్నారు కానీ, ఇక సహనానికి సమయం లేదని గల్లా కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, మీ మిత్రపక్షాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని జయదేవ్ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+