అనుష్క హానీ ట్రాప్: అలీకి 5 రోజుల పోలీసు కస్టడీ
హైదరాబాద్: ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ దేశీయురాలిగా భావిస్తున్న అనుష్క అగర్వాల్‌కు అందించిన కేసులో నిందితుడు ఆసిఫ్ అలీని హైదరాబాదు పోలీసులు పీటీ చట్టం కింద మీరట్ నుండి హైదరాబాదుకు తీసుకు వచ్చారు. అతనిని కోర్టు ముందు హాజరుపర్చారు.
కోర్టు ఆసిఫ్ అలీని 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఆసిఫ్ అలీని నగర పోలీసులు పీటీ వారెంట్ కింద హైదరాబాదుకు తీసుకు వచ్చారు.

అనుష్క అగర్వాల్‌కు, సమాచారం అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పతన్ కుమార్ పొద్దార్, మరో వ్యక్తికి ఆసిఫ్ అలీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అనుష్క చెప్పిన వారికి అతను పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చాడు. అలీ అకౌంట్లో నుండే పతన్‌కు, మరో జవాన్ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. తమ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో.. పోలీసులు గురువారం నుండి అసీఫ్ అలీని విచారించనున్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం.. ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ దేశీయురాలికి చేరవేసిన సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ అరెస్టైన విషయం తెలిసిందే. పతన్ తర్వాత మరో జవాను కూడా అరెస్టయ్యాడు. అనంతరం పోలీసులు ఆసీఫ్ అలీని అరెస్టు చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications