ఆగ‌స్టు నెల అంటే చంద్ర‌బాబు కి ద‌డ‌..!!

తెలుగుదేశం పార్టీకి ఆగ‌స్టు నెల అంటేనే అంత‌గా క‌లిసిరాదు. ఆగ‌స్టు నెల‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విచిత్ర సంఘ‌ట‌న‌లు అన్ని జ‌రిగిపోతుంటాయి. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కాలం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ లో ఇదే సంక్ష‌భం కొన‌సాగుతోంది. ఆగస్టు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతుంటారు. అప్ప‌ట్లో ఎన్టీ రామారావు కు ఆగస్టు నెలలో రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. రెండు సార్లు కూడా ఆయన అధికారాన్ని కోల్పోయారు. 1984 ఆగస్టు 15వ తేదీన నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావును గద్దె దింపారు. ఆ తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు ఎన్టీ రామరావుపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు. ఇది 1995 ఆగస్టులో జరిగింది. త‌ర్వాత కాలంలో ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్ కు ముఖ్య మంత్రిగా చంద్ర బాబు చాలా కాలం ప‌ని చేసి ఎన్నో కుదుపుల‌ను ఎదుర్కొన్నారు. ఆ సంక్షోబాలు అన్నీ కూడా ఆగ‌స్టులో సంభ‌వించ‌డం విశేషం.

ఆగ‌స్టు సంక్షోభం రిపీట్ అవుతుందా..? అప్ర‌మ‌త్తంగా టీడిపి శ్రేణులు..!

ఆగ‌స్టు సంక్షోభం రిపీట్ అవుతుందా..? అప్ర‌మ‌త్తంగా టీడిపి శ్రేణులు..!

డైన‌మిక్ ముఖ్య మంత్రి గా ప్ర‌శంస‌లు అందుకుంటున్న చంద్ర బాబుకు ఆగ‌స్టు నెల మాత్రం ద‌డ పుట్టిస్తుంటుంది. పార్టీలో ఏదో సంక్షోబం చంద్ర‌బాబు ను కుదిపేస్తుంటుంది. రాజ్య స‌భ స‌భ్యుడుగా ఉన్న హ‌రిక్రిష్ణ ప‌ద‌వికి రాజీనామా చేసి చంద్ర బాబు వ్య‌తిరేక ఎమ్మెల్యేల‌తో కొత్త పార్టీ పెడ‌తార‌న్న ఊహాగానాలు తారా స్థాయిలో జ‌రిగిపోయాయి. అందుకు త‌గ్గ‌ట్టు గానే హ‌రిక్ర‌ష్ణ కూడా కొన్నాళ్లు చంద్రబాబుకు పంటికింద రాయిలా ప‌రిణ‌మించాడు. ఇది కూడా గ‌తంలో ఆగ‌స్టు నెల‌లో సంభ‌వించిన సంక్షోభ‌మే. ఆత‌ర్వాత హ‌రిక్రిష్ణ ను బుజ్జ‌గించి దారిలోకి తెచ్చుకునేందుకు చంద్ర బాబుకు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చినంత‌ప‌నైంది.

తెలుగుదేశం పార్టీకి ఏ కుదుపు వ‌చ్చినా ఆగ‌స్టులోనే..!! ఆచితూచి అగుడు వేయ‌నున్న చంద్ర‌బాబు..!

తెలుగుదేశం పార్టీకి ఏ కుదుపు వ‌చ్చినా ఆగ‌స్టులోనే..!! ఆచితూచి అగుడు వేయ‌నున్న చంద్ర‌బాబు..!

పార్టీ సీనియ‌ర్ నేత లాల్ జాన్ బాషా కూడా ఆగ‌స్టు నెల లోనే రోడ్డు ప్ర‌మాదానికి గురై మ‌రిణించారు. చంద్ర‌బాబు ఆగ‌స్టు నెల‌లో తీసుకునే నిర్ణ‌యాలు కూడా అంత‌గా అచ్చిరావ‌ని పార్టీలో కూడా చ‌ర్చ జ‌రుగుతూంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే చంద్ర బాబు కూడా సంక్షేమ రంగ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న గాని, వ్య‌వ‌స్థాప‌ర‌మైన నియామ‌కాలు ఏదీ కూడా ఆగ‌స్టు నెల‌లో నిర్వ‌హించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. ఇక చంద్ర బాబు రాజ‌కీయ జీవితంలో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయిన బ‌షీర్ బాగ్ కాల్పుల ఘ‌ట‌న కూడా ఆగ‌స్టు నెల‌లోనే సంభ‌వించింది.

తెలుగుదేశానికి మాయ‌ని మ‌చ్చ‌.. ఆగ‌స్టులో జ‌రిగిన బ‌షీర్ బాగ్ కాల్పులు..

తెలుగుదేశానికి మాయ‌ని మ‌చ్చ‌.. ఆగ‌స్టులో జ‌రిగిన బ‌షీర్ బాగ్ కాల్పులు..

పెంచిన విద్యుత్ ఛార్జీలు త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ అఖిల ప‌క్షం నిర్వ‌హించిన ఛ‌లో సెక్ర‌టేరియ‌ట్ కార్య‌క్ర‌మం హింసాత్మ‌కంగా మారింది. సెక్ర‌టేరియ‌ట్ లోకి దూసుకు వ‌స్తున్న అఖిల ప‌క్ష నేత‌లను నిలువ‌రించే క్ర‌మంలో పోలీసులు కాల్పులు జ‌రిపారు. అదే కాల్పుల్లో ఇద్ద‌రు వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌లు మ‌రిణించ‌డం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న 2000 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 28న చోటుచేసుకుంది. ఈ దుస్సంఘ‌ట‌న నుండి తేరుకోవ‌డానికి చంద్రబాబుకి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత 2004 లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డం జ‌రిగింది. కాగా హోరా హోరీగా సాగిన నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం కూడా బ‌షీర్ బాగ్ సంఘ‌ట‌న జ‌రిగిన 17సంవ‌త్స‌రాల‌కు స‌రిగ్గా అదే నెల‌.., అదే తేదీన వెలువ‌డింది. 2000సంవ‌త్స‌ర‌వం ఆగ‌స్టు 28 బ‌షీర్ బాగ్ సంఘ‌ట‌న జ‌రిగితే స‌రిగ్గా ప‌దిహేడు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ అదే రోజు ఆగ‌స్టు 28న నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం వెలువ‌డింది.

ఆగ‌స్టులో ఏ ముహూర్తాలు పెట్టుకోని చంద్ర‌బాబు.. సంయ‌మ‌నంగా ఉండే యంత్రాంగం..

ఆగ‌స్టులో ఏ ముహూర్తాలు పెట్టుకోని చంద్ర‌బాబు.. సంయ‌మ‌నంగా ఉండే యంత్రాంగం..

ఉత్కంఠ ప‌రిణాల‌మాల మ‌ద్య జ‌రిగిన నంద్యాల ఉప‌న్నిక ఫ‌లితం తెలుగుదేశం పార్టీకి వంద ఏనుగుల బ‌లాన్నిచ్చింది. ఆగ‌స్టు సంక్షోభం తెలుగుదేశం పార్టీని, చంద్ర బాబు ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌రపెట్టేదైతే నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితం కూడా పార్టీని కుదిపేస్తుందేమో అనే అనుమానాల‌ను పార్టీ శ్రేణులు వ్య‌క్తం చేసాయి. ఇక తాజాగా కేంద్రంతో ప్ర‌ఛ్చ‌న్న యుద్దం నెల‌కొన్న త‌రుణంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నే అంశం పై ఉత్కంఠ నెల‌కొంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఏదైనా కీడు జ‌ర‌గ‌బోతోంది అంటే అది ఆగ‌స్టులో జ‌రుగుతుంది గ‌న‌క బాబుతో స‌హా యంత్రాంగం అంతా అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం ప‌రిపాటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+