ఉచిత బస్సు ప్రయాణం వేళ హిందూపురంలో ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య.. వీడియో చూడండి
ఏపీలో ఉన్న మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఉచిత బస్సు ప్రయాణ పథకం నేటి నుండి ప్రారంభమైంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళా ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభమైన ఈ స్కీం ఏపీలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ తో ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులలో ఇకపై మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హంగామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణం చేసేలా ఈ స్త్రీ శక్తి పథకాన్ని తీసుకువచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత మహిళలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపిస్తే జీరో టికెట్ మీద ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. ఇక నేడు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించిన వేళ హిందూపురంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హంగామా చేశారు.
"స్త్రీ శక్తి" పథకం: హిందూపురంలో బస్సు నడిపిన బాలయ్య#NandamuriBalakrishna #Balakrishna #SthreeShakti #FreeBus #PoliticsToday #AndhraPradesh #Oneindia #OITelugu pic.twitter.com/qfO7aW7E7K
— oneindiatelugu (@oneindiatelugu) August 15, 2025
బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన బాలకృష్ణ
మరో సూపర్ సిక్స్ హామీ అయిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన క్రమంలో ఆయన హిందూపురం ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ లోని తన నివాసం వరకు బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రయాణికులతో ఉన్న బస్సును ఆయన ఎటువంటి భయం లేకుండా దూకుడుగా నడిపారు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు బాలయ్య బస్సు నడిపిన స్టైల్ చూసి జై బాలయ్య అంటూ కేకలు పెట్టారు.
బాలయ్యతో కలిసి ప్రయాణం చెయ్యటంతో స్థానికులలో సంతోషం
తమ నియోజకవర్గ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, ఆమెతో కలిసి ప్రయాణం చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక బాలయ్య బస్సు నడుపుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాక, ఇది చూసిన ప్రతి ఒక్కరు ఏం చేసినా స్పెషలే.. బాలయ్య బాబు కి జై అంటూ ఆయనపై అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications