ఫలితాలపై బెట్టింగ్ బాబుల కొత్త లెక్క .. ఏపీలో టీడీపీ , వేసీపీ మాత్రమే కాదు జనసేన కూడా హాట్ ఫెవరెట్టే
ఏపీలో బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ఈ దఫా ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ అని చెప్పాలి. రాజకీయ వర్గాలకు సైతం ఎవరిని విజయం వరిస్తుంది అనేది అర్ధం కాని అంశంగా వుంది . ఇటీవల ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తరువాత రానున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కాగా ఏపీలో బెట్టింగ్ జరిగేది ప్రధాన పార్టీలైన టీడీపీ మరియు వైసీపీ లపై కాదు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేన పై కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు బెట్టింగ్ రాయుళ్ళు . జనసేన పార్టీపైన కూడా కోట్లల్లో బెట్టింగ్ జరుగుతుందని సమాచారం.

జనసేనపైనా జోరుగా బెట్టింగ్ లు ... కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయుళ్ళు
ఈసారి జరిగిన ఎన్నికల్లో పవన్ గాజువాక , భీమవరం నుండి రెండు స్థానాల నుండి పోటీ చేశారని సంగతి అందరికీ తెలిసిందే. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి గెలుస్తారనేది మొదటి పోటీ.ముందుగా ఒక్కస్థానానికే పవన్ పరిమితం అవుతాడా లేక రెండు స్థానాల్లో విజయం సాధిస్తాడా అనే అంశంపై బెట్టింగ్ ప్రధానంగా జరుగుతుంది. ఇక గెలుపొందితే ఆ స్థానాల్లో పవన్ ఎంత మెజారిటీ సాధిస్తాడు అనే అంశంపై విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంది.

జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది.. హంగ్ వస్తుందా అనే అంశాలపైనా బెట్టింగ్
ఇకపోతే జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది రెండవ అంశం. అయితే అది కూడా 20 స్థానాలకే పరిమితం అవుతుందా లేక ఎక్కువ స్థానాలు సాధించుకుంటారా అనే అంశంపైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది . ఇక మూడోది రాష్ట్రంలో హంగ్ వస్తుందా రాదా, జనసేన కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది కూడా బెట్టింగ్ రాయుళ్ళకు బెట్టింగ్ పెట్టే అంశం.

జనసేనపైనా వందల కోట్ల బెట్టింగ్
హంగ్ ఏర్పడి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అభిమానులు బెట్టింగ్ కాస్తుంటే, అటువంటి అంశానికి తావులేదని మరొకవర్గం బెట్టింగ్ పెడుతుంది . ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనపై కూడా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వందల కోట్ల బెట్టింగ్ లు అటు ప్రధాన పార్టీల మీదే కాదు జనసేన పార్టీపైన కూడా పెడుతుండటం విశేషం .
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications