బాబు తీరుతో అలిగాను, జగన్ వల్లే... ఎస్‌పివై సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో తన కూతురుకు టిక్కెట్టు ఇవ్వలేదేని చంద్రబాబుపై అలిగిన మాట వాస్తవమేనని నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి చెప్పారు.

గెలుపు ఓటములపై 'గోస్పాడు', భూమా ఫ్యామిలీకి కలిసి వచ్చేనా?, వైసీపీ ధీమా ఇదే

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించే శక్తి ఉన్న నేతలను తమ వైపుకు తిప్పుకొనేందుకు రెండు పార్టీల నేతలు విశ్వప్రయత్నాలను చేస్తున్నారు.

''పాపానికి ఓటు వేయాలని దేవుడు చెప్పడు, అంతిమ విజయం హీరోదే, బాబుకు ఉరిశిక్షైనా తక్కువే''

ఉదయం పూట ఒక పార్టీలో ఉన్న నేతలు సాయంత్రానికి మరో పార్టీలోకి మారుతున్నారు. రెండు పార్టీలు కూడ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నంద్యాలలో ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో ఆయన వివరించారు.

నంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం

చంద్రబాబుపై అలిగాను

చంద్రబాబుపై అలిగాను

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో టిక్కెట్టు కోసం అలిగిన మాట వాస్తవమేనని నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లెో తన కూతురుకు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబును కోరిన విషయాన్ని ఆయన ప్రకటించారు. అయితే భూమా బ్రహ్మనందరెడ్డికి టిడిపి టిక్కెట్టు ఇవ్వడంతో బాబు తీరుపై అలిగినట్టుగా ఎస్‌పివై రెడ్డి చెప్పారు.

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
 తప్పనిపరిస్థితుల్లోనే భూమా కుటుంబానికి మద్దతిచ్చాను

తప్పనిపరిస్థితుల్లోనే భూమా కుటుంబానికి మద్దతిచ్చాను

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగుతున్న ఉప ఎన్నికల్లో తప్పనిపరిస్థితుల్లోనే భూమా కుటుంబానికి మద్దతిచ్చినట్టుగా నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి ప్రకటించారు. ఈ స్థానంలో తన కూతురికి టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.టిడిపి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్న టిడిపి ముఖ్య నేతలు ఎస్‌పివై రెడ్డితో చర్చించారు. ఆయనను ఒప్పించారు. దీంతో ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన సమ్మతించారు. భూమా కుటుంబానికి మద్దతిచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. తప్పనిపరిస్థితుల్లోనే భూమా కుటుంబానానికి మద్దతిచ్చినట్టు ఆయన చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి ఆయన మద్దతిచ్చే పరిస్థితి లేదు.

నంద్యాలలో గెలిచేవారిదే 2019లో ప్రభుత్వం

నంద్యాలలో గెలిచేవారిదే 2019లో ప్రభుత్వం

నంద్యాల ఉపఎన్నికలో గెలిచే వారిదే 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉంటుందని ఎస్‌పివై రెడ్డి చెప్పారు. ఈ విషయమై ఆయన ఛాలెంజ్ చేశారు. 2019 ఎన్నికలకు నంద్యాలలో జరుగుతున్న ఉపఎన్నికలు సెమీఫైనల్స్ వంటివన్నారు ఎస్‌పివై రెడ్డి.నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తోంది ఎస్‌పివై రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

 జగన్ వైఖరి వల్లే 2014లో వైసీపీ ఓటమి

జగన్ వైఖరి వల్లే 2014లో వైసీపీ ఓటమి

2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ వల్లే వైసీపీ అధికారంలోకి రాలేదని ఎస్‌పివై రెడ్డి చెప్పారు. జగన్ ఇంకా అవే విధానాలను అనుసరిస్తున్నారని ఎస్‌పివై రెడ్డి అభిప్రాయపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తోందని చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరకుంటే జగన్ నంద్యాలలో అభ్యర్థిని నిలిపేవారా అంటూ ఆయన ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp candidate Bhuma brahmandha redddy will win in Nandyal by poll said MP SPY Reddy.Tdp will win 2019 assembly elections he said.
Please Wait while comments are loading...