5 మిరియాలతో ఇలా చేయండి.. మీ సుడి తిరుగుతుంది
జ్యోతిష్య శాస్త్రం శనిదేవుడిని న్యాయదేవుడిగా పేర్కొంటుంది. శని అందరినీ ఇబ్బంది పెడతాడనే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. కానీ మనం మంచి పనులు చేస్తే వాటికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ఇస్తాడు. ఏ వ్యక్తిపైనైనా శని సడేసతి రెండున్నర ఏళ్లు ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాల స్థానంతోపాటు వాటి దిశ కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జ్యోతిష్యంలో గ్రహాలను శాంతింపచేయడానికి పలు నివారణలున్నాయి. అలాగే శని సడేసతి నుంచి తప్పించుకోవడంలో మిరియాలు ఎంతో దోహదపడతాయి. వంటగదిలో ఉపయోగించే నల్ల మిరియాలు ఆరోగ్యానికే కాకుండా జ్యోతిష్య పరిష్కారానికి కూడా ఉపయోగపడతాయి. శని బాధలను తొలగిస్తాయి. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

* 5 నల్ల మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై 7 సార్లు తిప్పాలి. ఆ తర్వాత ఒక కూడలి వద్ద లేదంటే ఎవరూ లేనిచోట నిలబడి నాలుగు దిక్కులకు నాలుగు విసరాలి. ఐదో మిరియాన్ని ఆకాశంలోకి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లాలి.
* నల్ల మిరియాల్ని, 11 రూపాయల్ని.. నల్ల గుడ్డలో కట్టి పేదవారికి దానం చేయాలి. ఈ ఉపాయం వల్ల శని దేవ్ సడేసతి నుంచి విముక్తి కలుగుతుంది.
* ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నల్ల మిరియాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. వాటిమీద అడుగు పెట్టి బయటకు వెళ్లాలి. ఏ పనికోసమైతే మీరు వెళుతున్నారో ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది.
* చెడు దృష్టి, దిష్టిని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో ఏదైనా మూలలో దీపం పెట్టి 7 నుంచి 8 వరకు మిరియాలను కాల్చాలి. ఈ చిట్కా వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications