Bonda uma: పోలీసులు వేధిస్తున్నారు.. ఏమైనా జరగొచ్చు, సీబీఐ విచారణ డిమాండ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పై రాయి దాడి ఘటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ రాయి దాడి ఘటన నేపధ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర కు ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో జగన్ పై రాయి దాడి ఘటనలో జరుగుతున్న పరిణామాలపై బోండా ఉమ స్పందించారు.
తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు రెడీగా ఉన్నారు
నామినేషన్ వేసిన తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని బోండా ఉమా మండిపడ్డారు. నేరగాడి చేతిలో పోలీసులు కీలుబొమ్మలా మారి తనని ఇబ్బంది పెడుతున్నారని, ఎన్నికల సమయంలో వేధిస్తున్నారని టిడిపినేత బోండా ఉమా అభిప్రాయం వ్యక్తం చేశారు. వందమంది పోలీసులు, తన ఆఫీసును చుట్టుముట్టారు అని, తనపై ఒక యుద్ధానికి వచ్చినట్టు పోలీసులు వచ్చారని, తనపై తప్పుడుకేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బోండా ఉమా మండిపడ్డారు.

తనపై, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం
వేముల సతీష్ తో జడ్జి ముందు 164 స్టేట్మెంట్ తీసుకుంటున్నారని, మా పేర్లు చెప్పమని సతీష్ పైన, ఆయన కుటుంబం పైన ఒత్తిడి చేస్తున్నారని, తన మీద, చంద్రబాబు మీద ఒత్తిడి పెంచడం కోసం కాంతి రాణా టాటా వడ్డెర కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారని, మహిళలను కూడా వేధిస్తున్నారని బోండా ఉమా పేర్కొన్నారు.
జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఇలా చెయ్యాలి
తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి ఏం చెప్తే అది పోలీసులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారంలో నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని బోండా ఉమ తెలిపారు. ఇక దుర్గారావు ప్రాణాలతో ఉన్నాడా? లేక వివేకానంద తరహాలో చంపేశారా అన్నది తెలియడంలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్
రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారని, నన్ను ఏ సమయంలోనైనా జైల్లో పెట్టొచ్చు.. ఏవైనా జరగొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్న కొందరి వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పోలీస్ అధికారులు ఉంటే ఎన్నికల నిర్వహణ సజావుగా సాగదని బోండా ఉమా అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications