బొత్సా మజాకా ? స్ధానిక ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్..!

ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఇవాళ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కూటమి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా విపక్ష వైసీపీ నుంచి చిన్న చిన్న నాయకులను సైతం తమ పార్టీవైపు తిప్పుకుంటోంది. వారికి అభ్యర్ధిత్వాలు, పదవుల ఆశ చూపిస్తోంది. ఇలాంటి సమయంలో కూటమిని నడుపుతున్న టీడీపీకి ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)ఝలక్ ఇచ్చారు.

జగన్ కామెంట్స్ పై జాతీయ స్ధాయిలో చర్చ..! అదే టర్నింగ్ కాబోతోందా ?
జగన్ కామెంట్స్ పై జాతీయ స్ధాయిలో చర్చ..! అదే టర్నింగ్ కాబోతోందా ?

తన సొంత జిల్లా విజయనగరంలోని గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ కు బొత్స వల విసిరారు. క్షేత్రస్దాయిలో వ్యూహాలతో సంప్రదింపులు జరిపి ఏకంగా 150 కుటుంబాల్ని ఇవాళ పార్టీలోకి తీసుకొచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీకి ఎన్నికల వేళ ఊపు వచ్చినట్లయింది. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, బొడ్డు రాము ఈ 150 కుటుంబాల్ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇవాళ బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ , మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.

Botsa Satyanarayana Turns the Tables on TDP as 150 Families Join YSRCP Ahead of Local Polls
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!

రాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో చేరికల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ చేరికలు గజపతినగరం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని ఏకపక్షంగా ముగించాలని భావిస్తున్న అధికార కూటమి పార్టీలకు ఈ చేరికలు షాకిచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+