అమ్మా.. ఆకలేస్తోంది! ఆకలితో అల్లాడుతున్న బాల్యం!

యుద్ధం మిగిల్చిన ఆరని గాయాలు, నిలువ నీడ లేక శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జీవితాలు, దానికి తోడు ఒళ్లు గగుర్పొడిచే చలికాలం ముంచుకొస్తున్న వేళ గాజా ప్రజలకు మరో కోలుకోలేని పరిస్థితి ఎదురైంది. ఆకలికేకలతో అల్లాడే దారుణ పరిస్థితి దాపురించింది. ఒక్క పూట కడుపు నింపుకోవడం కోసం చిన్నారులు తమ దీనమైన ముఖాలతో ఎదురుచూస్తున్నారు. పొట్టచేతపట్టుకుని అల్లాడుతున్న అమాయక పౌరులకు నిత్యం ఆసరాగా నిలిచే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార సంస్థ(WFP) తీవ్ర నిధుల కొరత కారణంగా దాదాపు 5 లక్షల మందికి ఉచిత ఆహార పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 1.6 మిలియన్ల మందికి అందుతున్న ఆహారం.. ఇకపై కేవలం 1.1 మిలియన్లకు పడిపోనుంది. కేవలం ఆర్థిక వనరులు లేకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార సంస్థ(WFP) పాలస్తీనా డైరెక్టర్ షాన్ హ్యూస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

డెంగ్యూకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసిందా? భారత్‌లో తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!
డెంగ్యూకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసిందా? భారత్‌లో తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!

సైనిక దాడులు, బాంబు వర్షాల నుంచి తమ పిల్లలను కాపాడుకున్న తల్లిదండ్రులకు ఇప్పుడు 'వారి ఆకలి కేకలను ఎలా తీర్చాలి?' అనే ప్రశ్న అతిపెద్ద దిగ్భ్రాంతిగా మారింది. గ్యాస్ సిలిండర్లు లేక ప్లాస్టిక్, కాగితాల చెత్తను కాల్చి వంట చేసుకుంటున్న దయనీయ పరిస్థితుల్లో రోజుకు దక్కే ఒక్క పూట మెతుకు కూడా దూరమయ్యే స్థితి రావడం అక్కడి మానవాళిని శోకసంద్రంలో ముంచెత్తింది. కమ్యూనిటీ కిచెన్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే తల్లుల కన్నీళ్లు, సరైన పోషకాహారం లేక క్షీణిస్తున్న పసిపిల్లల ప్రాణాలు.. గాజాలో ముంచుకొస్తున్న కరువు భయానక దృశ్యానికి అద్ధం పడుతున్నాయి.

UN World Food Programe Cuts Food Aid for 5 00 000 People in Gaza Due to Funding Shortage and winter Approach

అరకొర తిండితో ఆకలి కేకలు.. తల్లుల రోదనలు
గాజాలోని తాత్కాలిక పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తున్న శరణార్థులకు ఈ వార్త పిడుగుపాటులా మారింది. ఖాన్ యూనిస్ సమీపంలోని అల్-మావాసి క్యాంపులో ఐదుగురు పిల్లలతో ఉంటున్న మెర్వత్ అల్-సతారీ అనే తల్లి కన్నీరుమున్నీరవుతూ.. " ఇది మాకొక పెద్ద విపత్తు. ఇప్పటికే ఇస్తున్న అరకొర ఆహారంతోనే రోజులు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు మరింత తగ్గిస్తే చిన్నపిల్లల పొట్ల ఎలా నింపాలి? కొన్ని రోజులు ఈ కమ్యూనిటీ కిచెన్ భోజనం కోసమే గంటల తరబడి నిరీక్షిస్తున్నాం" అని ఆ తల్లి తన బాధను పంచుకుంది. మరికొందరు తల్లులు మాట్లాడుతూ.. కమ్యూనిటీ కిచెన్లలో ఇచ్చే కొద్దిపాటి పప్పు, పాస్తాలు ఇప్పటికే ఎటూ సరిపోవడం లేదని, ఇకపై పరిస్థితి మరింత దారుణంగా మారనుందని వాపోతున్నారు.

పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. ఆ పైలట్లపై నిషేధం విధింపు
పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. ఆ పైలట్లపై నిషేధం విధింపు

కమ్యూనిటీ కిచెన్లు, రేషన్ సరఫరాలో కోతలు
ప్రపంచ ఆహార సంస్థ మద్దతుతో నడిచే కమ్యూనిటీ కిచెన్లు రోజుకు 2,50,000 భోజనాలు అందించేవి. అయితే ఇకపై రోజుకు 1,50,000 భోజనాలు మాత్రమే అందించనున్నాయి. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోని కుటుంబాలకు ప్రతిరోజూ ఇచ్చే భోజనాన్ని కాస్తా.. రెండ్రోజులకు ఒకసారిగా మార్చేశారు. ప్రతి నెలా బియ్యం, పిండి, రేషన్ డబ్బాలు పొందే వారి సంఖ్య కూడా 1.1 మిలియన్ల నుంచి 6 లక్షలకు పడిపోయింది. గాజా జనాభాలో 80 శాతానికి పైగా నిరుద్యోగంతో అలమటిస్తూ.. కేవలం విదేశీ సాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు.

ముంచుకొస్తున్న కరువు ముప్పు
రాబోయే 6 నెలల పాటు అత్యవసర సేవలను కొనసాగించడానికి తమకు తక్షణమే 450 మిలియన్ డాలర్ల నిధులు అవసరమని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార సంస్థ(WFP) తెలిపింది. ఇప్పటికే గాజా ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం సరైన పోషకాహారం లభించక వందలాది మంది చిన్నారులు మరణించారు. దాదాపు 1.4 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. తుపాకీ గుళ్ల నుంచి ప్రాణాలు కాపాడుకున్నా.. పొట్ట చేతపట్టుకుని ఆకలి చావులతో పోరాడుతున్న గాజా మానవాళికి ఈ నిధుల కోత కోలుకోలేని దెబ్బగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+