ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. అదే జరిగితే పండుగే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఒక అరుదైన అవకాశాన్ని కల్పించింది. మహిళా పోలీసులు తమకు నచ్చిన శాఖను వారే ఎంచుకునే లాగా అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది.

వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13,500 మంది మహిళా పోలీసులు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసులను నియమించారు. అయితే వారి హోదా పైన కొంతకాలం పాటు వివాదం కూడా నడిచింది. మహిళా పోలీసులను హోం శాఖ పరిధిలోకి తీసుకువచ్చి వారికి యూనిఫామ్ కూడా ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

Bumper offer for the women police in AP village ward secretariat women police will be promoted soon

మహిళా పోలీసుల విధులపై ప్రభుత్వ కసరత్తు
ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా అప్పట్లో దాఖలు చేశారు. ఇక 2024 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ వీరి విధులపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక వీరు తాము ఏ శాఖలో పని చేయాలి అనేది వారి నేరుగా నిర్ణయం తీసుకోవచ్చు.

శాఖను ఎంచుకునే అవకాశం వారిదే
హోం శాఖలో పని చేయాలా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేయాలా అనేది ప్రభుత్వం వారిని ఎంచుకోమని వారి సొంత నిర్ణయానికి వదిలేసింది. దీంతో ప్రస్తుతం వీరి నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది ప్రభుత్వం. ఈ వివరాలు రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వారు ఎంచుకున్న దానినిబట్టి వారికి పదోన్నతులు కల్పించనున్నారు అధికారులు.

మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు.. ఇప్పటికే చర్చలు
ఇక మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధుల కేటాయింపు పైన కూడా ప్రభుత్వం దృష్టిని సారించింది. దీనిపైన మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే చర్చలు జరిపి ఏం చేయాలో ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలి అనే దానిపైన అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

మహిళా పోలీసులకు పదోన్నతులు
ఇక త్వరలో ఈ అంశాలపై స్పష్టత వస్తే పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మహిళా పోలీసులకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు, పదోన్నతులు ఎలా కల్పిస్తారు అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర అంశంగా మారింది. ఏది ఏమైనా మహిళా పోలీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంత మేలు చేస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+