రాహుల్! చంద్రబాబు పాపాలు మేం మోయాలా?: కాంగ్రెస్ పార్టీకి రామచంద్రయ్య రాజీనామా
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ప్రకంపనలు రాజేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంత కుమార్ రాజీనామా చేయగా, తాజాగా శనివారం మరో సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అందుకే రాజీనామా
ఈ సందర్భంగా సీ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది కూడా లేదని, ఆయన ఎవరితోనైనా కలుస్తారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీకి ఏం అవసరం?
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తాము సమర్థించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దేశంలోనే చంద్రబాబుకు మించిన అవకాశవాది లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేయడంతోపాటు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్న చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని సీ రామరామచంద్ర నిలదీశారు.

శాలువా కప్పి, లడ్డూలిస్తే లొంగుతారా?
టీడీపీకి ఊతమివ్వడం తప్ప చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏం లాభం లేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి వచ్చి శాలువాలు కప్పి లడ్డూలు ఇస్తే చంద్రబాబుకు లొంగుతారా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపించారు.

బాబు పాపాలను మేం మోయాలా?
చంద్రబాబు పాపాలను భుజాన వేసుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని అన్నారు. మరోసారి అవినీతి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రయ్య స్పష్టం చేశారు. గుంటూరుకు రాహుల్ వచ్చి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారని గుర్తు చేశారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుతో పొత్తు ఎలా?
మరో పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారా? అని సీ రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర సీనియర్ నాయకులతో ఒక్కమాట కూడా అడగకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమేంటని ప్రశ్నించారు. తాము ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయగలమని అన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications