వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెయిల్ ట్రాజెడీ: కేసు, స్టవ్ వెలిగించడంతోనే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నగరం ఘోర దుర్ఘనకు సంబంధించి గెయిల్ అధికారులపై కేసు నమోదైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా గెయిల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.

గ్యాస్ పైప్‌లైన్ పేలుడు మానవ నిర్లక్ష్యం వల్లే జరిగిందని మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది సోమరాజు ఫిర్యాదు చేశారు. ప్రమాదకరమైన గ్యాస్, పెట్రోల్ పైపులైన్లు వేస్తున్నపుడు ప్రమాదాలు జరిగితే నియంత్రించే వ్యవస్థను ఆయా గ్రామాల్లో పెట్టకపోవడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. స్పందించిన హెచ్చార్సీ ప్రభుత్వాన్ని నివేదిక కోరుతూ కేసును వచ్చే నెల 10కి వాయిదా వేసింది.

గెయిల్ ప్రమాదం ఇంటిల్లిపాదినీ బలితీసుకుంది. చిన్నారులుసహా ఆరుగురిని మాంసపు ముద్దలు చేసేసింది. 216 జాతీయ రహదారి చెంతనే నగరంలోని ఓఎన్జీసీ, గెయిల్ ప్రధాన ప్లాంటు ముఖద్వారం వద్ద గటిగంటి వాసు దశాబ్దకాలం పైనుంచే హోటల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. వాసు కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సజీవ దహనమయ్యారు.

పక్షులు కూడా..

పక్షులు కూడా..

గెయిల్ ప్రమాదంతో లేచిన మంటలు ఎగిరిపోవడానికి పక్షులకు కూడా సమయం ఇవ్వలేదు. మంటల్లో మాడిన పక్షులు ఇలా..

దిక్కుమొక్కు లేక..

దిక్కుమొక్కు లేక..

నగరం గ్రామంలో ఒక్కసారిగా మంటలు లేవడంతో పక్షులు కూడా ఆహుతి అయ్యాయి. ఆ దారుణం తీవ్రమైన కలతకు గురి చేస్తోంది.

కుటుంబ సభ్యులంతా...

కుటుంబ సభ్యులంతా...

గెయిల్ ప్రమాదానికి కుటుంబంలోని ఆరుగురు కూడా ఆహుతి అయ్యారు. హోటల్ నడుపుతూ జీవనం సాగించే ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు.

కూరగాయలూ ఆహుతి

కూరగాయలూ ఆహుతి

కుటుంబంలోని ఆరుగురు ఆహుతి అయిన దృశ్యాన్ని చూసి హోం మంత్రి చినరాజప్ప కన్నీటిని నిలువరించుకోలేకపోయారు.

ట్రాక్టర్ బుగ్గి పాలు

ట్రాక్టర్ బుగ్గి పాలు

మంటలు అత్యంత దారుణంగా లేచాయి. దేన్నీ వదలకుండా కాల్చేశాయి. ఓ ట్రాక్టర్ ఇలా మంటలకు కాలిపోయి..

ఈ నష్టం తీరేదా..

ఈ నష్టం తీరేదా..

మరణించినవారు మరణించగా బతికి ఉన్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రతిదీ మంటల్లో కాలిపోయింది.

మోటార్ సైకిల్ ఆహుతి

మోటార్ సైకిల్ ఆహుతి

నగరం గ్రామంలో ప్రతిదీ మంటలకు బలైంది. అగ్నిదేవుడి ఆగ్రహానికి ఓ మోటార్ సైకిల్ ఇలా కాలిపోయింది.

ఆరేదీ తీరేదీ కాదు..

ఆరేదీ తీరేదీ కాదు..

ఏళ్ల తరబడి కలతపెట్టి, గుండెలను పిండి చేసే రీతిలో గెయిల్ ప్రమాదం చోటు చేసుకుంది. నగరం గ్రామంలో ఏమీ మిగలలేదు.

మృత్యుదేవత గ్యాస్ రూపంలో పొంచి ఉన్న విషయం గుర్తించని వాసు ప్రతి రోజులాగే తినుబండారాల తయారీ కోసం స్టవ్‌ను వెలిగించాడు. ఆ ప్రాంతమంతా అప్పటికే గ్యాస్‌తో నిండిపోవడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వాసుతోపాటు అతడి తల్లి అనంత లక్ష్మి(60), విజయవాడ నుంచి చుట్టపుచూపుగా వచ్చిన దగ్గర బంధువు గటిగంటి మధు (35) ఈ ప్రమాదంలో మాడి మసైపోయారు.

అక్కడే నివాసం ఉన్న వాసు భార్య కోకిల (34) తమ పిల్లలు ఆరేళ్ల సుజాత, తొమ్మిదేళ్ల సాయి గణేష్‌ను తీసుకుని వెనుకమార్గం నుంచి బయటకెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అన్నివేపులా మంటలు చుట్టుముట్టడంతో పిల్లలతో సహా మంటలకు ఆహుతై పోయింది.

తల్లి కోకిల మృతదేహం మధ్యలో ఉండగా ఓ వైపు కుమార్తె, మరో వైపు కుమారుడు మృతదేహాలు ఉన్నాయి. ఆమె చేతుల్లోనే రెండు శవాలు ఉండడం ముగ్గురూ మాంసపు ముద్దల్లా మారిపోయారు.

English summary
Case has been booked against GAIL officers on Nagaram tragedy. Six members of a family dead in the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X