వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోని ఆ ఏడు జిల్లాల్లో కరోనా కల్లోలం.. వెల్లడించిన కేంద్రం, ఆ వేరియంట్ తో వణుకుతున్న జనం !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని ప్రధానమైన ఏడు జిల్లాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో ఉండడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది . కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఢిల్లీలో ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ 7 జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4 వ స్థానం

రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4 వ స్థానం

అత్యంత క్రియాశీల కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంటే, 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో కేసుల గ్రాఫ్ సరళంగా ఉండగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేసులు గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారి కేసుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఏపీ 4వ స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా కేసులు పెరుగుతున్న జిల్లాలను చూస్తే చిత్తూరు జిల్లాలో అన్ని జిల్లాల కంటే అధికంగా కేసుల పెరుగుదల కనిపిస్తుంది.

ఏపీలో కరోనా పంజా విసురుతున్న 7 ప్రధాన జిల్లాలు ఇవే

ఏపీలో కరోనా పంజా విసురుతున్న 7 ప్రధాన జిల్లాలు ఇవే

చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 13-19 తారీఖు మధ్య 6,843 కేసులు నమోదైతే, ఏప్రిల్ 27 నుండి మే 3వ తారీఖు మధ్య 16,315కు కేసులు పెరిగాయి. గుంటూరు జిల్లాలోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి .ఎక్కడ చూసినా హాస్పిటల్స్ రద్దీగా కనిపిస్తున్నాయి. అటు గుంటూరు జిల్లాలోని ఏప్రిల్ 13 -19 తేదీల మధ్య 5,627 కేసులు నమోదు కాగా ఏప్రిల్ 27- మే 3వ తారీకు మధ్యలో 12,967 పెరిగాయి. కర్నూలు, శ్రీకాకుళం ,తూర్పుగోదావరి, విశాఖపట్నం ,అనంతపురం జిల్లాలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.

ఏపీలో ఎన్ 440 కె వేరియంట్ .. భయపడుతున్న జనం , పక్క రాష్ట్రాల ఆంక్షలు

ఏపీలో ఎన్ 440 కె వేరియంట్ .. భయపడుతున్న జనం , పక్క రాష్ట్రాల ఆంక్షలు

ఈ ఏడు జిల్లాల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎన్ 440 కె వేరియంట్ విజృంభిస్తున్న క్రమంలో పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చత్తీస్ ఘడ్ , ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంక్షలు విధించాయి. ఇటు తెలంగాణా సైతం సరిహద్దులు మూసివేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ప్రజలు భయ పడుతున్న పరిస్థితి ఉంది.

Recommended Video

Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Oneindia Telugu
 కొనసాగుతున్న పాక్షిక లాక్ డౌన్ , కరోనా కట్టడికి జగన్ సర్కార్ యత్నం

కొనసాగుతున్న పాక్షిక లాక్ డౌన్ , కరోనా కట్టడికి జగన్ సర్కార్ యత్నం


ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ ను ప్రకటించి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. నిన్న తొలిరోజు ఏపీలో పాక్షిక లాక్ డౌన్ ప్రశాంతంగా సాగింది. ప్రజలు ఎవరూ బయటకు రాలేదు.ప్రధాన నగరాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రెండు వారాల పాటు ఈ విధానం అనుసరిస్తే బయటపడే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తుంది. ఏది ఏమైనా ఏపీలో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని తాజాగా కేంద్రం ప్రకటించిన లెక్కల ప్రకారం తెలుస్తుంది.

English summary
Corona epidemic is booming in Andhra Pradesh. Corona cases are on the rise, especially in the seven major districts of AP. Of the 30 districts in the country where corona is expanding the fastest in the last two weeks, 7 districts in Andhra Pradesh are currently in the state of Andhra Pradesh. Union Medical Health Secretary Love Agarwal made the revelation in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X