అమరావతికి మరో బిగ్ న్యూస్-కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ఇవాళ మరో బిగ్ న్యూస్ చెప్పింది. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో అమరావతి రాజధానికి ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీకి వీలుగా కొత్త రైల్వే రైన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా కృష్ణానదిపై సైతం మరో వంతెన నిర్మించనున్నారు. దీంతో అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, చెన్నైకి కనెక్టివిటీ రాబోతోంది. దీంతో కూటమి సర్కార్ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతి రాజధానిలో 57 కిలోమీటర్ల పొడవున రూ.2245 కోట్లతో నిర్మించే కొత్త రైల్వే రైన్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజదాని పరిధిలోకి వచ్చే ఎర్రబాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.ఇందులో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన కూడా నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతోంది.
వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్ లోనే కేంద్రం గుంటూరు డివిజన్ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.1100 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 106 కిలోమీటర్ల పొడవున రైల్వే మార్గం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో ఎర్రబాలెం-నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల మార్గం, అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5 కోట్ల మేర, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసే రైల్వే మార్గాల డీపీఆర్ కు కూడా ఆమోదించారు. దీనికి రూ.2679 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ఎర్రబాలెం-నంబూరు మార్గానికి కేబినెట్ మోక్షం లభించింది.












Click it and Unblock the Notifications