వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఎస్ఈ విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్- ఉన్నచోటే పరీక్ష రాయొచ్చు- రూల్స్ ఇవే...

|
Google Oneindia TeluguNews

సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లిన 10, 12వ తరగతి విద్యార్ధులు.. తాము ఉన్న చోటు నుంచే వాయిదా పడిన ఎగ్జామ్స్‌కు హాజరు కావచ్చునని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

centre allows cbse students to write exams at where they are now
ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన సీబీఎస్ఈ విద్యార్ధులు అక్కడే పరీక్షలు రాసేందుకు వీలుగా తమ చిరునామా వివరాలను పాఠశాలలకు తెలపాలని సూచించారు. దాని ఆధారంగా పాఠశాల యాజమాన్యం వారికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అటు విద్యార్థులు ఏ స్కూల్‌ నుంచి పరీక్షలు రాయాలన్న వివరాలను జూన్ మొదటి వారంలో వెల్లడిస్తామని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.కాగా, ఇప్పటికే వాయిదాపడిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను CBSE విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలను జూలై 1 నుంచి జూలై 15 మధ్య నిర్వహించనున్నారు.

English summary
central govt has decided to allow cbse students of 10th and 12th standard to write their final exams at where they are now. hrd ministry has released new guidelines for them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X