ఏపీలో రెండు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం..

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌తో పాటు తీవ్ర‌మైన వ‌డ‌గాలులు కూడా వీస్తున్నాయి. అయితే, ఏపీ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్లటి క‌బురును అందించింది. ఈ వేడిగాలుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తూ రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

నైరుతి దిశగా వీస్తున్న పొడిగాలుల కారణంగా రాబోయే రెండు మూడు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదు కానున్నాయ‌ని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 2-3 డిగ్రీలు పెరిగి.. 26-27 డిగ్రీలుగా నమోదవుతాయి అని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. ఇక‌, గురువారం నాడు రాష్ట్రంలోని 21 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. 97 మండలాల్లో వడగాలులు వీచాయి. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ‌ని అధికారులు అంటున్నార‌ను. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌య్యింది. త‌రువాతి స్థానంలో కడప‌ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9 డిగ్రీలు న‌మోదుకాగా, మూడో స్థానంలో కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు నమోదయ్యాయ‌ని అధికారులు చెబుతున్నారు.

Chance of rain in AP for two days

ఏప్రిల్ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు..

శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు కావొచ్చ‌ని, దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 41నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు కావొచ్చ‌ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఇక‌, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల నుంచి జూన్‌ వరకు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు ఎక్కువ వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+