Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ షర్మిలకు చంద్రబాబు, పవన్ గ్రీటింగ్స్..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలతో పాటు అభిమానులు, నాయకులు కూడా గ్రీటింగ్స్ తెలిపారు. ఇదే క్రమంలో ఏపీలో ఆమె రాజకీయంగా విభేధిస్తున్న అధికార పార్టీ నేతలు కూడా షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. అనంతరం అందరికీ ఆమె పేరు పేరునా ధన్యవాదాలు చెప్తున్నారు.

వైఎస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాను అంటూ తెలిపారు. అలాగే ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా షర్మిలకు పుట్టిినరోజు గ్రీటింగ్స్ తో ట్వీట్ చేశారు.

Chandrababu and pawan kalyan convey birth day wishes to ys sharmila

ఇదే కోవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ షర్మిలకు ఎక్స్ లో పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలిపారు. ఇందులో పవన్..
శ్రీమతి వై.ఎస్.షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రదేశ్ పి.సి.సి. అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్.షర్మిల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు చిరాయువునిచ్చి, సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Chandrababu and pawan kalyan convey birth day wishes to ys sharmila

కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు షర్మిలకు పుట్టిినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకురాలిగా వైఎస్ షర్మిల గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువత ఆశయాల కోసం ఆమె చేస్తున్న పోరాటం దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజల హక్కుల పరిరక్షణకు వైఎస్ షర్మిల చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆమెకు మరిన్ని విజయాలు, ప్రజాసేవలో దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ, ఆరోగ్యంతో, ఆనందంతో శతాయుష్షు నిండాలని ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+