చంద్రబాబు అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు .. ఇప్పుడు 23 మందే గెలిచారన్న జగన్
Recommended Video
ఏపీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి. వైసీపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే 23నవెలువడిన ఫలితాల విషయంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంఖ్య 23 అని, ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 23 అని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ 23 అని వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు.

అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పటానికి చంద్రబాబే నిదర్శనం అన్న జగన్
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్పీ నేతగా జగన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలు అప్పగించిన పెద్ద బాధ్యత సక్రమంగా అందరం నెరవేర్చాలని కోరారు. అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చెప్పడానికి నిదర్శనం చంద్రబాబేనని దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని అన్నారు.గత ఎన్నికల సమయంలో వైసీపీ నుండి గెలిచిన 23మందిని టీడీపీలోకి ఫిరాయింపు చేసేందుకు చంద్రబాబు ప్రోత్సహించారని దేవుడు అందుకే ఇప్పుడు చంద్రబాబుకు 23 స్థానాలకే పరిమితం చేశారని జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకుంటా .. అందరూ సహకరించాలని కోరిన జగన్
2024 ఎన్నికల్లో ఇప్పటి కంటే గొప్పగా మనం ఎన్నుకోబడాలంటే, అందరం గొప్పగా పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేస్తానని, దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రక్షాళన చేస్తానని జగన్ ధీమా వ్యక్తం చేశారు . ఇందుకు, పార్టీ నాయకులందరూ సహకరించాలని కోరారు.‘జగన్ మంచి ముఖ్యమంత్రి' అని అనిపించుకుంటానని, మంచి చేసేందుకు దేవుడు తనకు మనసు, జ్ఞానం ఇవ్వాలని కోరారు. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని, ఆ ఎన్నికల్లో ‘క్లీన్ స్వీప్' చేయాలని పార్టీ నాయకులకు జగన్ సూచించారు.

ఏపీలో జగన్ కు స్వాగతం పలకనున్న సమస్యలు .. జగన్ లక్ష్యం నెరవేరేనా ?
మొత్తానికి మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలని తాపత్రయపడుతున్న జగన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పూర్తి కాని పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న జనం , రాష్ట్ర ఖజానాలో ఆర్ధిక లోటు వంటి అనేక అంశాలు ఇబ్బందికరంగా మారనున్నాయి. ఇక ఆ ఇబ్బందులను అధిగమించి జగన్ పాలన సాగించి మంచి ముఖ్యమంత్రి అని అందరి మన్ననలు పొందటం సాధ్యం అవుతుందా ? ఏమో ముందు ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications