బాలయ్య భువనేశ్వరి మధ్య నలిగిపోతున్న చంద్రబాబు!
నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో తన అన్నయ్య బాలకృష్ణ గౌరవార్థం నారా భువనేశ్వరి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. నారా భువనేశ్వరీ తన సొంత ఫామ్ హౌస్ లో అత్యంత ఘనంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల కుటుంబ వేడుకను నిర్వహించారు. ఈ కుటుంబ వేడుకకు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నారా భువనేశ్వరి, బాలకృష్ణ గురించి చంద్రబాబు సరదావ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరైన ఈ ఫ్యామిలీ పార్టీ చాలా ఉత్సాహభరితంగా సాగింది.ఇక ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి, బాలకృష్ణ గురించి చేసిన సరదావ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. భువనేశ్వరి చంద్రబాబుకు మైకందిస్తూ ఏవండీ బాల గురించి కొన్ని మాటలు మాట్లాడండి.. అయితే ఐదు నిమిషాల్లో స్పీచ్ అయిపోవాలి ఇదేమి రాజకీయ ప్రసంగం కాదు..గంటలు మాట్లాడొద్దని చెప్పారు.

భువు బాలయ్య మధ్య నలిగిపోతున్నా
తన అర్ధాంగి మాటలకు నవ్వుతూనే మైక్ తీసుకున్న చంద్రబాబు అన్నాచెల్లెళ్ల ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగానే అద్భుతమైన సాయంత్రమని పేర్కొన్న చంద్రబాబు ఒకవైపున బాలయ్య మరోవైపు అంతే పవర్ఫుల్ అయిన భువు ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నా.. వీళ్ళిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదం అంటూ ఛలోక్తులు విసిరారు. అసలు ఈ ఫ్యామిలీ పార్టీ గురించి తనకేమీ తెలియదని ఇదంతా భువనేశ్వరినే ప్లాన్ చేసిందని చంద్రబాబు చెప్పారు.
నిన్నటి దాకా అల్లరి బాలయ్య, నేడు పద్మ భూషణుడు
అసలు నేనేం చేస్తానో మీకు ఎవరికీ చెప్పను.. నా అన్నయ్యకి నేను చేయబోయే కార్యక్రమం.. నా అభిమానంతో చేస్తున్నాను ఇందులో మీకు ఎవరికీ ప్రమేయం లేదు ఇది నా అభిమతం అని భువనేశ్వరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అంటూ చంద్రబాబు వివరించారు. బాలకృష్ణని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు నిన్నటిదాకా అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణుడు అయ్యాడని ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారని అందుకు తన గర్వపడుతున్నానని చెప్పారు.
బాలయ్యకు పద్మ భూషణ్ రావటం గర్వకారణం
ఇక బాలయ్య అన్ స్టాపబుల్ కెరీర్ లో ఒక మైలురాయి అని ఆయనకు పద్మ భూషణ్ రావడం తమ కుటుంబానికే గర్వకారణం అని చంద్రబాబు పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో బాలకృష్ణ పైకి అల్లరిగా కనిపించిన ఆయనలో ఒక డెప్త్ ఉంటుందని, ఒక డేడికేషన్ ఉంటుందని, గొప్ప మానవతావాద దృక్పధం ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని చంద్రబాబు కితాబిచ్చారు.
బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబాబు
క్యాన్సర్ ఆసుపత్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన బాలయ్య క్యాన్సర్ ఆస్పత్రిని దేశంలోనే అగ్రగామి ఆసుపత్రిలో ఒకటిగా నిలిపినందుకు తాను ఎంతో గర్విస్తున్నాను అన్నారు. ముచ్చటగా మూడుసార్లు హిందూపురంలో ఎమ్మెల్యేగా బాలయ్య గెలిచాడని అప్పుడప్పుడు ఆయన తన అర్ధాంగి వసుంధరకు టికెట్ ఇవ్వమని అడుగుతుంటాడని కావాలని ఆ విధంగా అడుగుతాడో లేక అర్ధాంగిని మెప్పించడానికి అడుగుతాడో అర్థం కాదంటూ చంద్రబాబు బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ విన్న కుటుంబ సభ్యులు భువనేశ్వరి బాలయ్య మధ్య నలిగిపోతున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వేదిక వద్ద నవ్వుల పువ్వులు పూశాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications