సొంత చెల్లెళ్ళకే జగన్ వెన్నుపోటు, చెల్లెలు షర్మిల పార్టీపై మాట్లాడరేం .. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. కొందరు జగన్ వెనక ఉండి షర్మిలతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని, తన వెనుక ఉన్నానని తెలిస్తే ఆంధ్ర పార్టీ అని ముద్ర పడుతుందని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అని చర్చ జరుగుతుంటే, మరికొందరు సీఎం కేసీఆర్ కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీల్చడం కోసం వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని బిజెపి షర్మిలను రంగంలోకి దించింది అని ఆసక్తికర చర్చను సైతం సాగిస్తున్నారు.

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నాను అని చెబుతుంటే ఏ2 మాత్రం లేదని అంటారే ..

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నాను అని చెబుతుంటే ఏ2 మాత్రం లేదని అంటారే ..

ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాం అంటూ లోటస్ పాండ్ వేదికగా ప్రకటించిన షర్మిల కొత్త పార్టీపై టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కొత్త పార్టీ పెడుతున్నాను అని చెబుతుంటే ఏ2 మాత్రం లేదని అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఆ వీడియోను ప్లే చేసిన చంద్రబాబు ఆనాటి జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఈనాడు ఏమైంది అంటూ ప్రశ్నించారు.

 ఇంట్లో ఉన్న వాళ్లకి జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా

ఇంట్లో ఉన్న వాళ్లకి జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా

విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిల పార్టీపై నోరు మెదపాల్సిన సమయం వచ్చిందని , జగన్ మాట్లాడాలని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ పై రాష్ట్రంలో సొంత చెల్లెళ్ళే పోరాటం చేస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు నాడు వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఇక ఇప్పుడు షర్మిల పోరాటం చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్న వాళ్లకి జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేసిన చంద్రబాబు, అలాంటి జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అంటూ ప్రశ్నించారు.

 వైఎస్ షర్మిల పార్టీపై జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

వైఎస్ షర్మిల పార్టీపై జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఇంకా తేలేదని, హత్య చేసిన నేరస్థులతో జగన్ చేతులు కలపాలని ఆరోపించారు చంద్రబాబు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బాబాయ్ హత్య కేసు విచారణకు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం తమ హయాంలో సిబిఐ విచారణ వద్దని విముఖత వ్యక్తం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కుటుంబంలోని వారికి వెన్నుపోటు పొడిచే నిజం జగన్ కు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తానికి షర్మిల పార్టీ పెట్టే వ్యవహారాన్ని కూడా చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారనే అర్థం వచ్చేలా చంద్రబాబు జగన్ పై విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+