వవన్ కళ్యాణ్‌పై నోరు జారితే ఊరుకునేది లేదు: చంద్రబాబు వార్నింగ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఏపీలోని పలు సమస్యలను లేవనెత్తినప్పుడు, ప్రత్యేక హోదా గురించి టిడిపి, బిజెపి ప్రభుత్వాలను నిలదీసినప్పుడు పలువురు టిడిపి నేతలు ఇది వరకు కౌంటర్ ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ఒకటి రెండుసార్లు వారికి క్లాస్ పీకడంతో వారు తగ్గారు.

ఈ అంశంపై చంద్రబాబు మరోసారి స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను అంటే ఊరుకునేది లేదని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు. గత ప్రత్యేక హోదా అంశంపై పవన్ కళ్యాణ్ టిడిపి-బిజెపిలపై ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే.
అంతకుముందు, మీడియా ఇంటర్వ్యూలోను పవన్ పైన స్పందించారు. పవన్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని, ఏది మంచి ఏది చెడు అనేది నేతలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications