హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కి బాబు ఫోన్, పిలుపు!: ఎన్టీఆర్‌భవన్లో వేర్వేరుగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. కెసిఆర్ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాబు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే తన ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానిస్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున ఆయనను అభినందించేందుకు ఓ బృందాన్ని పంపించనున్నారు.

Chandrababu will greet KCR

ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ, ఎపిలకు వేర్వేరు గదులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్లో ఇక నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నాయకులకు విడివిడిగా గదులు కేటాయించనున్నారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు ఏ గదులు ఏ రాష్ట్ర నాయకులకు కేటాయించాలనే విషయం భవన్ అంతా కలియ తిరిగి పరిశీలించారు.

పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కెసిఆర్

సికింద్రాబాదు పరేడ్ మైదానంలో కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కెసిఆర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu will greet KCR in phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X