పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు షాక్-తాజా ఉత్తర్వులు..!

ఏపీలోని గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలకు ప్రభుత్వం (ap govt) మరోసారి తెరలేపింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల పునర్విభజనతో పాటు కార్యదర్శుల (panchayat secretaries) జీత భత్యాల్లోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులకు షాక్ తగలనుంది. ఈ మేరకు వారి పే స్కేల్స్ ను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీ పంచాయతీల్లో ప్రభుత్వం మరోసారి జా సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీల పునర్ వర్గీకరణ చేస్తోంది. అలాగే పంచాయతీలకు సిబ్బంది నియామక నమూనా ఖరారు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శుల విలీనం, పునర్‌వర్గీకరణకు ఆదేశాలు ఇచ్చింది. తాజా ఉత్తర్వు ప్రకారం మూడు గ్రేడ్లుగా పంచాయతీ కార్యదర్శుల్ని విభజిస్తున్నారు. ఇందులో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ ను తగ్గించారు.

Chandrababu s Shock AP Govt Decreases Pay Scales for Gram Panchayat Secretaries

గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ తర్వాత గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను తగ్గిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వీరికి రూ.28,280-89,720 పే స్కేల్ ఉండగా ఇకపై రూ.25,220-80,910గా ఇది మారుతుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి విధులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+