వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు పోలీసులతో ప్రమాదం ఉంది ; నా అరెస్ట్ లో కుట్ర కోణం : చింతమనేని షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఈరోజు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశామని విశాఖ రూరల్ ఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై టిడిపి నేతలు భగ్గుమన్నారు. ఇక తాజాగా స్టేషన్ బెయిల్ పై భీమడోలు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారన్న చింతమనేని

రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారన్న చింతమనేని


పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్టేషన్ బెయిల్ పై విడుదలైన తర్వాత తన ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన చింతమనేని న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. తనకు పోలీసులతో ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే మూడు మండలాల ఎస్సైలు తన మీద కేసులు నమోదు చేశారని పేర్కొన్న చింతమనేని ప్రభాకర్, పెదవేగి మండలం ఎస్సై కేసు ఎప్పుడు పెడతారో ఎదురుచూస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

జగన్ కేనా కుటుంబం ఉంది ?తనను అరెస్టు చేయడం వెనుక కుట్ర కోణం

జగన్ కేనా కుటుంబం ఉంది ?తనను అరెస్టు చేయడం వెనుక కుట్ర కోణం

తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని, జగన్ కేనా కుటుంబం ఉంది.. తనకు లేదా ..అని ప్రశ్నించారు. తనకు పోలీసులతో ప్రమాదం పొంచి ఉందని, తనకు నక్సల్స్ తో ఎలాంటి ప్రమాదమూ లేదని చింతమనేని తేల్చి చెప్పారు. తనను అరెస్టు చేయడం వెనుక కుట్ర కోణం దాగుందని చింతమనేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్పీ, కలెక్టర్లకు తెలియకుండానే తన అరెస్టు జరిగిందా అంటూ ప్రశ్నించారు చింతమనేని. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆందోళన చేస్తూ తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వాలని, ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారని, ఆ సమయంలో తమ పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించకున్నప్పటికీ, పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించామన్న కారణంతో కేసు నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనం

వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనం


విశాఖ జిల్లా నర్సీపట్నం వెళ్లిన తనను గంజాయి గురించి ప్రశ్నించే 151 నోటీసు ఇచ్చారని, ప్రశ్నించింది గంజాయి గురించి అయితే తనకు ఇచ్చిన నోటీసులో వేరేలా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇక తనకు 41 సీఆర్పీసీ క్రింద నోటీసులు ఇచ్చి వదిలేశారని పేర్కొన్నారు. అక్రమాలు చేసిన జగన్ తన కేసులపై డిశ్చార్జ్ పిటిషన్ వేశాడని, తనలాంటి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని చింతమనేని ధ్వజమెత్తారు. వైసిపి ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగుతుందని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తోందని విమర్శించారు. తనపై ఏ కేసు పెట్టినా హడావిడి చేస్తున్నారని, తాను ఎక్కడికైనా పారిపోతానా అని ప్రశ్నించారు.

చింతమనేనిని ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేని దుస్థితిలో పోలీసులు: లోకేష్ ఫైర్

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు . ఇక లోకేష్ కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు . రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఒక ఉదాహరణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చింతమనేనిని ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారంటే అధికార పార్టీకి పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్థమవుతుందని ఆయన విమర్శించారు.

జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకు ఆయుధంగా పోలీస్ వ్యవస్థ


తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లికి వెళ్లిన చింతమనేని ప్రభాకర్ ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకు పోలీస్ వ్యవస్థ ఆయుధంగా మారిందని లోకేష్ మండిపడ్డారు. ఇదే సమయంలో వైసీపీ కండువా కప్పి అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ లోకేష్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

English summary
Former Denduluru MLA and TDP leader Chintamani Prabhakar held a press conference at his home after being released on station bail. Chintamani questioned whether the police, who are supposed to protect justice, were doing injustice. He said he was in danger with the police. Prabhakar said he was worried that if there were four zones in Dendulur constituency, the SIs of three zones would have registered cases against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X