• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క‌ధానాయ‌కుడు తో ఓట్లు కురిసేనా : మ‌రి ఆ రెండు సినిమాలు : టిడిపి నేత‌ల్లో కొత్త టెన్ష‌న్‌..!

|

ఎపిలో ఎన్నిక‌ల ముందు సినిమా రాజ‌కీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు క‌ధానాయ‌కుడు సినిమాకు రాజ‌కీయ రంగు వద్ద‌నుకున్నా పులిమేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు టిడిపి నేత‌లు తొలి రెండు రోజుల్లో ఈ సినిమా చూడ‌టానికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. సినిమా అద‌ర‌హో అని అభినందిస్తున్నారు. మ‌రి.. వ‌చ్చే నెల‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సైతం టిడిపి శ్రేణులు వీక్షిస్తాయా.. నో అంటున్నారు టిడిపి నేత‌లు. పూర్తిగా చంద్ర‌బా బు ను ల‌క్ష్యంగా చేసుకొని తీస్తున్న ఆ సినిమా పై టిడిపి నేత‌లు ఆగ్ర‌హిస్తున్నా.. రాజ‌కీయంగా ప్ర‌భావం చూపే పొలిటి క‌ల్ సినిమా గా దీని పై అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

క‌ధానాయ‌కుడు కు సూప‌ర్ స‌పోర్ట్‌...

క‌ధానాయ‌కుడు కు సూప‌ర్ స‌పోర్ట్‌...

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన క‌ధానాయకుడు సినిమా పై సాధార‌ణంగా ఎన్టీఆర్ - బాల‌య్య అభిమానులు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కు పోటీగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వ‌స్తున్న స‌మ‌యంలో ఈ సినిమా ను విజ‌య‌వంతం చేయాల‌ని బాల‌య్య అభిమానులు..టిడిపి శ్రేణులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అధికారిక‌- రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం బాల‌కృష్ణ తో క‌లిసి ఈ సినిమాను వీక్షించారు. సినిమా పై ప్ర‌శంస‌లు కురిపిం చారు. 30 ఏళ్ల చ‌రిత్ర‌ను మూడు గంట‌ల్లో చూపించార‌ని..ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన బ్రహ్మాండంగా ఉంది. ఇతర నటులు, సాంకేతిక వర్గం గొప్పగా చేశారని సీయం అభినందించారు. ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయ‌టం సినిమా కు ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను తెలియ చేస్తోంది. ఎన్టీఆర్ సినిమా ఎనలేని స్ఫూర్తిని నింపిందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జీవితం పై సినిమాలో చూపించిన స‌న్నివేశాల‌ను చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో ప్ర‌స్తావించారు.

టిడిపి శ్రేణుల్లో జోష్‌..పార్టీకి మేలు చేస్తంద‌నే..!

టిడిపి శ్రేణుల్లో జోష్‌..పార్టీకి మేలు చేస్తంద‌నే..!

ఎన్టీఆర్ జీవితంలో టిడిపి ఏర్పాటు వ‌ర‌కు క‌ధానాయ‌కుడు లో చూపించిన బాల‌కృష్ణ‌..ఆ త‌రువాత పార్టీ వ్య‌వ‌హారాలు రాజ‌కీయంగా ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ జీవితం పై మ‌రో పార్ట్ గా సినిమా సిద్దం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.

ద‌ర్శ‌కుడు క్రిష్ తో పాటుగా న‌టీ న‌టులంద‌రినీ ముఖ్య‌మంత్రి మొద‌లు టిడిపి నేత‌లంతా అభినందిస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఏపిలో ఎన్నిక‌ల సంద‌డి సైతం మొద‌లైంది. క‌ధానాయుడు సామాన్య ఓట‌ర్ల పై ప్ర‌భావం చూపిస్తుం ద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు..పార్టీ ఏర్పాటుకు దారి తీసిన ప‌రిస్థి తుల‌ను వెండి తెర పై చూసిన త‌రువా సామాన్య ఓట‌ర్ల‌లో టిడిపి పై మ‌రింత సానుకూల‌త ఏర్ప‌డుతోంద‌ని టిడిపి నేత లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో..ఈ సినిమా కు పార్టీ శ్రేణులు ప్ర‌త్యేక ప్రాధ‌న్య‌త ఇస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని ప్ర‌త్యేక‌త‌ల‌ను మిన‌హా..వివాదాల‌కు ఆస్కారం లేకుండా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌టంతో..టిడిపి నేత‌లు ఒక ర‌కంగా దీనిని ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఆ రెండు సినిమాల పై అంచ‌నాలు ఏంటంటే..!

ఆ రెండు సినిమాల పై అంచ‌నాలు ఏంటంటే..!

క‌ధానాయకుడు సినిమాకు టిడిపి శ్రేణులు..అభిమానుల మ‌ద్ద‌తు భారీగా ల‌భిస్తోంది. ఇక‌, కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ బ‌యోపి క్ పేరుతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌..వైయ‌స్సార్ బ‌యోపిక్ పేరుతో యాత్ర సినిమా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. క‌ధానాయ కుడు సినిమాకు మ‌ద్ద‌తుగా నిలిచిన టిడిపి శ్రేణులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ను అదే స్థాయిలో నిర‌సించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ విడుద‌ల చేసిన రెండు పాట‌ల ద్వారా త‌న ల‌క్ష్యం ఏంటో ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసా రు. ఈ సినిమా పాటల పై టిడిపి నేత‌లు ఆర్జీవి పై న్యాయ పోరాటం సైతం చేస్తున్నారు. ప్ర‌తిగా ఆర్జీవి సైతం టిడిపి నేత ల‌కు నోటీసులు పంపారు. ఇక‌, ఈ సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి మ‌రిన్ని వివాదాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ఈ సినిమా పై ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టం తో టిడిపి శ్రేణులు త‌మ నాయ‌కుడిని డామేజ్ చేసేలా తీస్తున్నార‌ని ఇప్ప‌టికే ఆరోపిస్తున్నారు. వారు ఈ సినిమా వ్య‌వ‌హారంలో ఎలాంటి అడుగులు వేస్తార‌నేది ఆస‌క్తి క‌ర‌మే. ఇదే స‌మ‌యంలో వైసిపి శ్రేణుల‌కు ఉత్సాహం ఇచ్చేలా యాత్ర సినిమా విడుద‌ల‌కు రంగం సిద్దం అవుతోంది. ఈ సినిమా ద్వారా మ‌రోసారి వైయ‌స్సార్ ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌టం ఆ సినిమా ల‌క్ష్యం. ఇలా..ఎన్నిక‌ల వేళ‌..ఈ మూడు సినిమాలు.. ఏపి రాజ‌కీ యాల పై ప్రభావం చూపించే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఈ పొలిటిక‌ల్ సినిమాలు ఎన్ని వివాదాల‌కు కార‌ణం అవుతా యో చూడాలి...

English summary
AP C.M Appreciated Hero Balakirshna acting as NTR in Kadhanayakudu cinema. Chandra Babu watch cinema and remeber his attachment with late NTR. Another two poliltical related movies also ready to release. These movies creating political heat in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X