ఆ దేవుడు వదిలేసినా నేను మాత్రం వదలను, చేసిన పాపాలు వదలవు, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బుడమేరుకు గండ్లు పడితే వాటిని చూసిచూడనట్లు వ్యవహరించిన వైసీసీ నాయకులు వాటిని గాలికి వదిలేశారని ,గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు విజయవాడ ప్రజలు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

గత ప్రభుత్వంలోనే బుడమేరు ప్రాంతాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయని, ఆ గండ్లు పూడ్చకుండా వదిలేయడం వలన ఈరోజు విజయవాడకు ఇలాంటివి పరిస్థితి ఎదురైందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వరదలు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణం లో వచ్చిన మార్పులతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కూడా కారణం అయ్యాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

CM Chandrababu Naidu made sensational comments against YCP leaders

బుడమేరును అక్రమాలకు గురి చేశారని, అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారని, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుడమేరు గండ్లకు పనులు చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారని, ప్రకృతి విపత్తు గురించి గత వైసీపీ నాయకులు ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ దగ్గర పడవలు వదిలేసింది వైసీపీ వాళ్లే అని చంద్రబాబు మరోసారి ఆరోపించారు.

ప్రకాశం బ్యారేజ్ లో పడవలు వదిలేసి ఇప్పుడు ఏమి తెలియనట్లు వైసీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక వ్యాపారానికి వాడిన బోట్లు ఈరోజు ప్రకాశం బ్యారేజీ లో వదిలేసి ప్రజల ప్రాణాలు, వారి జీవితాలతో చెలగాటం ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ బుడమేరు గండ్లను పూడ్చకుండా వదిలేయడం వలనే ఈ రోజు విజయవాడ అతలాకుతలం అయయిందని చంద్రబాబు ఆరోపించారు.

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే విజయవాడకు వరదలు రావడానికి కారణమని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో బుడమేరు కోసం కేటాయించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం పక్కకు తరలించార,ని కనీస ఒక్క డ్రైన్ అయినా తవ్విన పాపాన పోలేదని చంద్రబాబు ఆరోపించారు. గత వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం అయ్యిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు వదిలిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తేలేదని, ఈ కేసు నుండి తప్పించుకోవడానికి కావాలనే మాపై నిందలు వేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+