Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. మంత్రులకు బాధ్యతలు, టాప్ ప్రయారిటీ అదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వరద ముంపు విజయవాడ ను ముంచెత్తటంతో వరద సహాయక చర్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజాగా మళ్లీ ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం ఆదేశం
వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారాన్ని అందించాలని సీఎం సూచించారు. చిన్నారులు, గర్భిణీలను పునరావస కేంద్రాలకు తరలించాలని వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

CM Chandrababu review of flood situation in AP Responsibilities for ministers top priority is

మంత్రులకు డివిజన్ల వారీగా భాద్యతలు అప్పగించిన చంద్రబాబు
ఇక మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితి పై సమీక్షించిన చంద్రబాబు మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయించారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతానికి వరద చేరుతుండడం పైన అక్కడ పరిస్థితిని సీఎం సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద కొట్టుకొచ్చిన బోట్లను ఏ విధంగా తప్పించాలో చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ప్రాణ నష్టం జరగకుండా బాధితుల తరలింపు ప్రయారిటీ అన్న చంద్రబాబు
అన్నిటికంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆహార సరఫరాకు ఆటంకాలు ఉండకూడదని పేర్కొన్న చంద్రబాబు బాధితుల తరలింపుకు కాకుండా అవసరమైన మేరకు ఆహార సరఫరాకు చాపర్లను వినియోగించాలని సూచించారు. ఇక ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రులు పార్థసారథి, అచ్చెన్నాయుడు బుడమేరు వాగు ముంపు పాపం గత పాలకులదేనని విమర్శలు గుప్పించారు .

సాయంత్రానికి సాధారణ పరిస్థితులు తెస్తామన్న మంత్రులు
వరద ముంపు సమయంలో సీఎం చంద్రబాబు స్పందించిన తీరుతో ప్రజల్లో భరోసా నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ముమ్మరం అయ్యాయని ఈరోజు సాయంత్రానికి సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయం అందిస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+