తుఫాను తీవ్రరూపం, ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
మురసు తుఫాన్ దూసుకొస్తోంది. అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోస్తాంధ్ర తీరానికి సమీపంలో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ని సీఎం చంద్రాబు అధికారులకు నిర్దేశించారు.
మురసు తుఫాను తీవ్రత పైన సీఎం చంద్రబాబు ముందస్తు సమీక్ష చేస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపాను గడచిన 6 గంటల్లో గంటకు 14 కిమీ వేగంతో కదులుతున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం నెల్లూరుకు 120 కిమీ,కావలికు 140 కిమీ, తిరుపతి 170కిమీ,ఒంగోలుకు 180 కిమీ,బాపట్లకు 200 కిమీ, దూరంలో కేంద్రీ తం అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా , రాయలసీమ మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ అర్ధ రాత్రి - తెల్లవారుజాము సమయంలో మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. దీంతో, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో వర్షాలు కురిసి వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని, సుమారు 13 నుంచి 15 టీఎంసీల నీరు చేరవచ్చని అంచనా వెల్లడించారు.

అధికారులకు కీలక దిశా నిర్దేశం
అర్నబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మురసు తుఫాన్ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అవసరమైన సామగ్రి, సిబ్బందితో విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని వివరించారు. తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అధికారులకు సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులను నింపాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్ పరిధిలోని వివిధ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
