సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదంలో ఏడుగురు అధికారులకు నోటీసులు జారీ

సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదం వ్యవహారంలో దర్యాప్తుకు ఆదేశించింది సీఎం కార్యాలయం. ఇక దీనిని దర్యాప్తు చేస్తున్న డీఆర్వో వెంకటేశం హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదానికి కారణమైన ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు.

ఇటీవల వరదకు గురైన కర్నూలు జిల్లా నంద్యాలలో సీఎం జగన్ పర్యటించిన సందర్భంలో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ పై అధికారులు తప్పుడు సమాచారం అందించారు.హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ఒక క్రమ పద్ధతిలో డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అధికారులు కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. సీఎం జగన్ హెలికాప్టర్ కు ల్యాండింగ్ సమస్య ఎదురవగా, సీఎంవో ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించి దీని మీద దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.

CM Jagan helicopter landing dispute .. notices issuued to seven officials

హెలికాప్టర్ నంద్యాలలో ల్యాండింగ్ కు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం వహించారని పలువురు అధికారులపై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించగా కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెంటనే స్పందించారు. విచారణ అధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించి అసలేం జరిగిందో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపిన డీఆర్వో వెంకటేశం ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 30న జరిగే వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇక నోటీసులు జారీ చసిన వారి వివరాలు చూస్తే సర్వే,ల్యాండ్ రికార్డుల ఏడీ హరికృష్ణ, శిరువెళ్ల, నంద్యాల తహసీల్దార్లు నాగరాజు, రమేశ్, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీ, డ్వామా పీడీ వెంకటసుబయ్య,ఉయ్యాలవాడ తహసీల్దార్ నాగేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ వేణు లకు నోటీసులు అందజేసి సమాధానం చెప్పాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కోఆర్డినేట్స్ రిపోర్టును డిగ్రీలు, నిమిషాలు, సెకన్ల ఫార్మాట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారులు కేవలం డిగ్రీల ఫార్మాట్ లోనే సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని సీఎంవో అధికారులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో ఏడుగురు అధికారులు విచారణ ఎదుర్కోబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+