• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిరణ్ కూడా పనికిరారు: జానా, నీళ్లివ్వాలని టిజి సెటైర్

By Srinivas
|

Jana Reddy
హైదరాబాద్: విభజన తుఫాను అడ్డుకుంటానని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మంగళవారం మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కేంద్ర ప్రభుత్వం ముందు పనికిరారన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా అంతే అన్నారు.

ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే వారంతా కుట్రదారులే అన్నారు. అసెంబ్లీలో సీమాంధ్ర ప్రాంత నేతలు బిల్లుపై అభ్యంతరాలను చర్చించాలన్నారు. గడువులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందన్నారు.

గడువులోగా తెలంగాణపై చర్చ జరగకుండా మరింత సమయం కోరే కుట్ర జరుగుతోందన్నారు. బిల్లు ఆలస్యమైతే ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయని హెచ్చరించారు. సభలో కొందరు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, స్పీకర్ సభ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లు పైన అవగాహన కోసమే లేక ఉద్దేశ్య పూర్వకమో కానీ స్పీకర్ సభను జనవరి 3 వరకు వాయిదా వేశారన్నారు.

కొండ్రుకు టిజి చురక

చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ మరో మంత్రి కొండ్రు మురళికి మంగళవారం చురక అంటించారు. ఇరువురు మంత్రులు ఒకే వేదికపై బిల్లు పైన పరస్పరం భిన్నంగా మాట్లాడిన విషయం తెలిసిందే. బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా ఏం లేదని టిజి చెప్పగా, కొండ్రు తమ ప్రాంతానికి న్యాయం జరిగేలా కేంద్రం బిల్లులో పొందుపర్చిందని చెప్పారు.

ఈ సమయంలో ఆయన కాసేపు ఏకధాటిగా మాట్లాడారు. కాంగ్రెస్‌పై మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని అయినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, 2014లో కూడా కాంగ్రెస్‌దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. విభజన బిల్లులో సీమాంధ్రకు మేలు జరిగే ఎన్నో అంశాలను కేంద్రం పొందుపరిచిందని కొండ్రు మురళి తెలిపారు. కొండ్రు మాట్లాడిన అనంతరం ఆయనకు కొన్ని మంచినీళ్లు ఇవ్వండి అంటూ సెటైర్ వేశారు.

కాగా, ముసాయిదా బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసేలా ఉందని టిజి వెంకటేష్ అన్న విషయం తెలిసిందే. బిల్లులో ఆర్థిక ప్యాకేజీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నందున బిల్లు పైన గట్టిగా వాదించలేకపోతున్నామని చెప్పారు. తమ లక్ష్యం సమైక్యాంధ్రనే అన్నారు. నేతలు, ప్రజలు ఉంటేనే పార్టీలు అనేవి ఉంటాయన్నారు.

సమైక్యాంధ్ర కోసం ఛలో ఢిల్లీ, ఛలో హైదరాబాదుకు ప్రజలు సహకరించాలని కోరారు. విభజన బిల్లు ఎక్కడికి అక్కడ అడ్డుకోవాలని కోరారు. కలిసి పోరాడితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రక్రియ నుండి తాము చర్చల ప్రక్రియకు తెచ్చామన్నారు. ప్రతిపక్షాల వైఖరి వల్లే సిడబ్ల్యూసి విభజన ప్రకటన చేసిందన్నారు. అసెంబ్లీలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామన్నారు.

English summary
Minister Jana Reddy on Tuesday said Chief Minister Kiran Kumar Reddy will not stall Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X