ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి.. కుటుంబంలో ఐదుగురు చిన్నారుల దుర్మరణం!!

మన జీవితంలో కొన్ని సంఘటనలు మనం అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. కొన్ని మంచి జ్ఞాపకాలను మిగిలిస్తే కొన్ని భరించలేని బాధకు దుఃఖానికి కారణం అవుతాయి. ఒక బొగ్గుల కంపనీ ఐదుగురు ప్రాణాలు తీస్తుందని ఊహించని కుటుంబం చేసిన పని ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

ఆ రోజంతా పిల్లలతో సంతోషంగా గడిపిన కుటుంబం ఊహకందని దారుణ విషాద ఘటనతో షాక్ కు గురైంది. గుండెలవిసేలా రోదిస్తుంది. బొగ్గుల కుంపటి కాలయముడై ఐదుగురి చిన్నారుల ప్రాణాలను ప్రాణాలకు యమ వేసింది. అసలే చలికాలం కావటంతో ఎముకలు కొరికేస్తున్న చలిలో చలి బాధ నుండి కాపాడుకోవడం కోసం ఒక కుటుంబం చేసిన పని అయిదుగురి ప్రాణాలను హరించింది.

Coal fire killed five children in a family in uttar pradesh!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణ సంఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. చలి నుండి ఉపశమనం కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారుల ప్రాణాలను హరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ జిల్లాకు చెందిన కుటుంబం చలిని తట్టుకోలేక రాత్రి పడుకునే ముందు ఇంట్లో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని ఏర్పాటు చేసుకుంది.

ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసి కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలోకి మునిగిపోయారు. కాసేపటికి బొగ్గుల కుంపటి నుంచి దట్టమైన పొగలు ఇల్లంతా వ్యాపించాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఇంటి తలుపు తీసి బయటకు వచ్చేలోపే ఇంట్లో పడుకుని నిద్రపోతున్న ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు.

వేడిగా ఉండడం కోసం పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఐదుగురి ప్రాణాలు హరించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఐదుగురు చిన్నారులు నిద్రలోనే విగత జీవులుగా మారటం అక్కడి వారందరినీ ఆవేదనకు గురి చేసింది. చిన్న బొగ్గుల కుంపటి వల్ల జరిగిన దారుణ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. తల్లి దండ్రులకు కడుపుకోత మిగిల్చింది. అందుకే చలిగా ఉందని వేడి కోసం మంటలు వేసుకునేవారు, కుంపట్లు పెట్టుకునే వారు జాగ్రత్తగ ఉండాలని సూచించబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+