AP Results: వైసీపీ, కూటమికి కాంగ్రెస్ భయాలు ? ఈ సీట్లలో డిసైడర్లు కాబోతున్నారా ?
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ, కూటమిలో పార్టీల అభ్యర్ధులకు దీటుగా పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా ఓట్లు సాధించినట్లు పోలింగ్ సరళిని నిశితంగా గమనిస్తే అర్దమవుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పుట్టగతుల్లేకుండా పోయాయి. కానీ పదేళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న పార్టీలతో పోలిస్తే కాంగ్రెసే బెటరున్న భావన పలు చోట్ల కనిపించిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సీట్లలో వైసీపీ, కూటమి అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది.
ఇలా వైసీపీ, టీడీపీని కలవరపెడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను పరిశీలిస్తే పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల, ఆమంచి కృష్ణమోహన్, కలికెర సుధాకర్, సాకే శైలజానాథ్, కిల్లి కృపారాణి, పల్లంరాజు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు పోటీ చేసిన వీరు.. తమ ప్రత్యర్థులైన వైసీపీ, కూటమి అభ్యర్ధుల ఓట్లను బాగానే చీల్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది ఏ స్ధాయిలో ఉందన్న దానిపై ఇప్పుడు ఆయా పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.

ఇందులో ముందుగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పోటీని పరిశీలిస్తే.. కడప లోక్ సభ సీటులో ఆమె ఎంట్రీ కచ్చితంగా అక్కడి సమీకరణాలను మారుస్తుందన్న చర్చ జరుగుతోంది. షర్మిల ఈసారి కడప లోక్ సభకు పోటీ చేయడం ద్వారా భారీగా వైసీపీ ఓట్లు చీల్చేయడం లేదా గెలుపుకు బాటలు వేసుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈసారి టీడీపీ కూడా తమ అభ్యర్ధి భూపేష్ రెడ్డిని కాదని రష్మిలకు ఓట్లు వేయించిందన్న చర్చ కడప జిల్లాలో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు.
షర్మిల తర్వాత రాయలసీమలో గెలుపు అవకాశాలున్న రెండు సీట్లు అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇక్కడి మడకశిరలో కలికెర సుధాకర్, శింగనమలలో సాకే శైలజానాథ్ రూపంలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రత్యర్థులు వైసీపీ, టీడీపీకి చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే జిల్లాల్లోని ఉరవకొండ సీటులోనూ వైసీపీ అభ్యర్ధి విశ్వేశ్వరరెడ్డిపై పోటీకి దిగిన ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా ఇక్కడ లెక్కల్ని మార్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అలాగే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, పూతలపట్టు నుంచి బరిలోకి దిగిన ఎంఎస్ బాబు, నందికొట్కూరులో ఆర్థర్, కాకినాడ ఎంపీ సీటులో పల్లంరాజు, కర్నూలు ఎంపీ సీటులో రాంపులయ్య యాదవ్ వంటి వారు సామాజిక వర్గాలు, ఇతర లెక్కలతో ఓట్లు చీల్చినట్లు తెలుస్తోంది. వీరు పార్టీ వారీగా, సామాజిక వర్గాల వారీగా చీల్చిన ఓట్లతో వైసీపీ, కూటమి అభ్యర్ధుల అవకాశాలకూ గండి పడటమూ లేక జయాపజయాలపై ప్రభావం పడటమూ తప్పేలా లేదు. అలాగే ఆమంచి, కలికెర సుధాకర్, శైలజానాథ్, షర్మిల వంటి వారు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications