కాంగ్రెస్ పార్టీకి షాక్: జగన్ పార్టీలో చేరిన కీలక నేత, అప్పుడే పిలిచారు, హామీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం‌: ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, తుమ్మపాల షుగర్స్‌ మాజీ చైర్మన్‌ దంతులూరి దిలీప్ కుమార్‌ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం వైసిపిలో చేరారు.

'ఆస్తులను అప్పగించండి, జగన్‌కు రివర్స్, వైసిపి మైండ్ బ్లాంక్'

పార్టీకి దిలీప్ రాజీనామా, జగన్‌కు విశాఖలో హ్యాపీ

పార్టీకి దిలీప్ రాజీనామా, జగన్‌కు విశాఖలో హ్యాపీ

ఈ మేరకు దిలీప్ కుమార్ పార్టీ అధిష్ఠానానికి బుధవారం లేఖ పంపించారు. తన అనుచరులతో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, దిలీప్ కుమార్‌ వైసిపిలో చేరనున్నట్లుగా స్థానికంగా ప్రచారం సాగింది. అన్నట్లుగానే వైసిపిలో చేరారు.

జగన్ సమక్షంలో వైసిపిలోకి

జగన్ సమక్షంలో వైసిపిలోకి

గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత

దిలీప్ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ హయాంలో తుమ్మపాల షుగర్స్‌ పాలకవర్గం చైర్మన్‌గా పని చేశారు. 1995లో టిడిపిలో చేరిన ఆయన కొద్దిరోజులకే తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటి వరకు పిసిసి కార్యదర్శిగా ఉన్నారు.

ఇటీవలే వారు ఆహ్వానించారు

ఇటీవలే వారు ఆహ్వానించారు

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఇటీవల తుమ్మపాలలోని దిలీప్ కుమార్‌ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. 12వ తేదీన జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. అయితే దిలీప్‌కుమార్‌ చేరికపై ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Vishakapatnam leader Dilip Kumar may join YSR Congress on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి