జాతీయ పార్టీతో ఏపీలోనూ కేసీఆర్ వర్సెస్ బీజేపీ ? కాషాయానికి హ్యాండిచ్చేదెవరు ? వారితోనే పొత్తు !

తెలంగాణలో బీజేపీపై పోరు మొదలుపెట్టి దాన్ని జాతీయ స్ధాయికి విస్తరించి, ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ పెట్టి మరీ కాషాయ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఏపీలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్.. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన వంటి ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి అండగా నిలుస్తున్న వేళ.. కేసీఆర్ ఇక్కడ ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది.

 కేసీఆర్ జాతీయ పార్టీ

కేసీఆర్ జాతీయ పార్టీ

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ స్ధాపనకు రంగం సిద్దమవుతోంది. భారత రాష్ట్ర సమితితో పాటు మరికొన్ని పేర్లను కూడా ఇందుకోసం పరిశీలిస్తున్నారు. ఇందులో ఏదో ఒకదాన్ని త్వరలో ప్రకటించేందుకు టీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి ముందే స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి విపక్ష నేతల్ని కలిసి వచ్చారు. కేసీఆర్ జాతీయ స్దాయిలో పార్టీ పెడితే కలిసి వచ్చేందుకు సాయం కోరారు. అయితే వీరి స్పందన ఎలా ఉన్నా కేసీఆర్ పార్టీ మాత్రం రెడీ అయిపోయింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటన ఉండొచ్చని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న ఏపీలో పరిస్ధితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

ఏపీ కలిసొచ్చేదెవరు ?

ఏపీ కలిసొచ్చేదెవరు ?

కేసీఆర్ స్ధాపించే జాతీయ పార్టీలో భాగంగా ఏపీలో కలిసొచ్చే పార్టీలు ఏవేవి అన్న దానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ విపక్ష నేతల్ని కలిసొచ్చిన కేసీఆర్ .. ఇప్పటివరకూ ఏపీలో పర్యటించి ఇక్కడి రాజకీయ పార్టీల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఏపీలో కేసీఆర్ కు కలిసొచ్చే పార్టీలే లేవా , లేకపోతే కేసీఆర్ ఎందుకు వాటికి చేరువ కాలేకపోతున్నారు, ఒకప్పటి తన మిత్రుడు జగన్ జాతీయ పార్టీకి మద్దతిచ్చే పరిస్దితుల్లో లేడా, ఆయన రాలేకపోతే ఇంకా వచ్చేవారెవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

బీజేపీ చుట్టూ ఏపీ పార్టీలు

బీజేపీ చుట్టూ ఏపీ పార్టీలు

ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని రాష్ట్రంలో రాజకీయం చేసే పరిస్ధితుల్లో ఈ మూడు పార్టీలు కూడా లేవు. దీంతో బీజేపీకి ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న జనసేనతో పాటు వైసీపీ, టీడీపీ కూడా కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నాయి. దీంతో బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు లేకపోయినా మరే ఇతర రాష్ట్రంలో లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కోటను ఛేదించాలంటే ఎవరివల్లా అయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అడుగు ఇక్కడ పడాల్సి ఉంది.

 కేసీఆర్ కు లాస్ట్ ఆప్షన్ అదే ?

కేసీఆర్ కు లాస్ట్ ఆప్షన్ అదే ?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి మద్దతిస్తున్నాయి. 2024 ఎన్నికల వరకూ బీజేపీ దూరం చేసుకుంటే తప్ప ఈ మూడు పార్టీలు కాషాయాన్ని వీడేలా లేవు. దీంతో ఇక మిగిలింది కోరల్లేని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మాత్రమే. రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల్ని జనం దూరం పెట్టి దశాబ్దం దాటిపోయింది. కాంగ్రెస్ ను దూరం పెట్టి దశాబ్దం కావస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల్ని కేసీఆర్ దగ్గరకు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగని మరో ప్రత్యామ్నాయంగా నేతల్నిప్రోత్సహించే పరిస్దితి కూడా లేదు. దీంతో కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప కేసీఆర్ కు మరో ఆప్షన్ కనిపించడం లేదు. అయితే తెలంగాణలో బీజేపీతో కూడా పోరాడుతున్న కాంగ్రెస్ ను దగ్గరకు తీసుకుంటే తప్ప ఏపీలోనూ కాంగ్రెస్ కలిసి రావడం కష్టమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+