కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా : 1,184 కొత్తకేసులు,11 మరణాలతో .. అధికంగా కేసులు ఆ జిల్లాలోనే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత దేశంలో నమోదవుతున్నరోజువారీ కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది . కొద్దిపాటి హెచ్చుతగ్గులతో నిత్యం కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,184 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీలో 58,545 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

రికవరీల కంటే ఏపీలో కొత్త కేసులే ఎక్కువ
కరోనా మహమ్మారి నుండి నిన్న ఒక్కరోజే 1,333 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కొత్త కేసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 13048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. గడచిన 24 గంటల్లో కోలుకున్న 1,333 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 20,19,657గా ఉంది . ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,46,841 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,136 గా ఉంది.

Corona in AP: 1,184 new cases, 11 deaths; highest cases in east godavari district !!

తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలులో
వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా 218 కేసులతో మొదటి స్థానంలో ఉంటే అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు జిల్లా 3 కేసులతో ఆఖరి స్థానంలో ఉంది.

జిల్లాల వారీగా కరోనా కేసుల లెక్కలివే
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా కేసులు వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 165 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 126 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 218 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 150 కరోనా కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 59 కరోనా కేసులు ,కృష్ణా జిల్లాలో 116 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి.

కరోనా విషయంలో అలెర్ట్ గా ఉండాల్సిందే .. జగన్ సూచన
నెల్లూరు జిల్లాలో 138 కేసులు, ప్రకాశం జిల్లాలో 144 కరోనా కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 27 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 35 కేసులు, విజయనగరం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. మరోపక్క సెప్టెంబరు అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా పరిస్థితిపై జరుగుతున్న సమీక్షలలో పదేపదే చెప్తున్నారు. ఇక స్కూల్స్ లో కరోనా కట్టడిపై దృష్టి సారించాలని ఆదేశిస్తున్నారు.

English summary
In the last 24 hours 1,184 corona cases and 11 deaths recorded in ap. The total number of corona cases registered in the state of Andhra Pradesh including the latest registered corona cases is 20,46,841.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X