జగన్ పై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ .. ఏమన్నారంటే
సీఎం జగన్‌పై అటు టీడీపీ, జనసేనలతో పాటు సీపీఐ కూడా దాడికి దిగింది . ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ నేత రామకృష్ణ తప్పు పడుతున్నారు . కరోనా నియంత్రణా హర్యలపై ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇచ్చిన సీపీఐ నేత రామకృష్ణ సీఎం జగన్ విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
మాస్క్‌లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు . ఏపీలోని 14 యూనివర్సిటీల పాలకమండళ్ళ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ల నియామకాల్లో తీసుకోవలసిన ప్రమాణాలను తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు . కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని రామకృష్ణ పేర్కొన్నారు .

ఇక సీఎం జగన్ ఎన్నికలు నిర్వాహించాలని పట్టు పట్టారని, ఆయన మాట విననందుకు ఎన్నికల కమీషనర్ రమేష్‌కుమార్‌పై జగన్ కక్షగట్టారని మండిపడ్డారు . కులం పేరుతో ఆయనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్‌కు కనిపించేది కాదని ఆయన మండిపడ్డారు . రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు . ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు . ప్రపంచమంతా కరోనా ఉంటే.. ఏపీలో జగన్ కొత్త వైరస్ కనిపెడుతున్నారు అని రామకృష్ణ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు .












Click it and Unblock the Notifications